హైదరాబాద్‌లో అద్భుతం ఆవిష్కారం..!

ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు సూపర్‌ స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. జైలర్‌ 2 ను దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ చాలా స్పెషల్‌ మూవీగా రూపొందిస్తున్నాడు.;

Update: 2026-04-07 07:30 GMT

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మాత్రమే అద్భుతాలు ఆవిష్కారం అవుతాయి. కొన్ని సినిమాలు అద్భుతంగా అనిపిస్తాయి, కొన్ని కాంబినేషన్‌లు అద్భుతాలను ఆవిష్కారం చేయడం మనం చూశాం. అయితే ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్‌ స్టార్‌లు కనిపించడం కచ్చితంగా అద్భుతం అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక్క సూపర్‌ స్టార్‌ను వెండి తెరపై చూస్తేనే అభిమానులు అద్భుతం అన్నట్లుగా చూస్తారు. అలాంటిది ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమాకు ఉండే క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి క్రేజ్‌ ఉన్న సినిమాలకు ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చాయో మనం చూశాం. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా జైలర్‌ 2 రాబోతుంది. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు సూపర్‌ స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. జైలర్‌ 2 ను దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ చాలా స్పెషల్‌ మూవీగా రూపొందిస్తున్నాడు.

జైలర్ 2 సినిమా కోసం...

జైలర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్‌తో పాటు చిన్న పాత్రలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటించడంతో ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగింది. శివరాజ్‌ కుమార్‌ ఉన్న సీన్స్ సినిమాకి మంచి హైప్‌ ను తెచ్చి పెట్టాయి. ఒక్క సూపర్‌ స్టార్‌ ఉంటేనే ఆహా... ఓహో అన్నట్లుగా టాక్‌ వచ్చింది. అలాంటిది జైలర్ 2 లో ఏకంగా నలుగురు సూపర్‌ స్టార్స్‌ను దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ చూపించబోతున్నాడు. ప్రస్తుతం నలుగురు సూపర్‌ స్టార్స్‌ జైలర్‌ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఒకే సారి నలుగురు హీరోలు షెడ్యూల్‌లో పాల్గొంటున్నారనే వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న జైలర్‌ 2 షూటింగ్‌ కోసం బాలీవుడ్‌ బాద్‌ షా, సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ ల్యాండ్‌ అయ్యాడని, ఆయన అయిదు నుంచి ఆరు రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది.

మోహన్‌ లాల్‌ పై కీలక సన్నివేశాల...

ఇప్పటికే మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఇక శివరాజ్‌ కుమార్‌తోనూ జైలర్‌ 2 కోసం సీన్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌తో పాటు మోహన్‌ లాల్‌, షారుఖ్‌ ఖాన్‌, శివ రాజ్‌ కుమార్‌ వంటి ముగ్గురు సూపర్‌ స్టార్స్‌ ఉంటే జైలర్‌ 2 సినిమాకు వచ్చే హైప్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రికార్డ్‌లు బద్దలు కొట్టే విధంగా ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్టార్‌ కాస్ట్‌ ఉన్న సినిమా రాలేదు. కనుక అభిమానులకు జైలర్ 2 సినిమా అనేది కన్నుల పండుగ అన్నట్లుగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గట్లుగా దర్శకుడు భారీ యాక్షన్‌ సీన్స్‌లో ఈ హీరోలను చూపించబోతున్నాడు.

రజనీకాంత్‌, షారుఖ్ ఖాన్‌ కాంబో...

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్‌తో అద్భుతం ఆవిష్కారం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకే సినిమాలో నలుగురు సూపర్‌ స్టార్స్ నటించడం వల్ల ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారు. జైలర్ 2 సినిమా కోసం షారుఖ్ ఖాన్‌ కేవలం అయిదు రోజులు డేట్లు కేటాయించాడని, అందుకు గాను ఆయన సాలిడ్‌ రెమ్యూనరేషన్‌ అందుకున్నాడంటూ సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అనిరుధ్‌ అందిస్తున్న సంగీతం మరోసారి ఓ రేంజ్‌లో ఉండబోతుందని అంటున్నారు. 2026 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో రజనీకాంత్‌ మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారని అభిమానుల చాలా ధీమాతో ఉన్నారు. జైలర్‌ హిట్‌తో సీక్వెల్‌ పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను అందుకునేనా అనేది తెలియాలంటే ఆగస్టు వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News