షూటింగ్ లో గాయాలపాలైన స్టార్ హీరో?
కాగా షారుఖ్ తన తర్వాతి సినిమా కోసం ఓ యాక్షన్ సీన్ కు సంబంధించిన షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి గాయాలపాలైనట్టు తెలుస్తోంది.;
ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలన్నీ ఏదొక రకంగా లేటవుతూ వస్తున్నాయి. వివిధ కారణాల వల్ల సినిమాలు చెప్పిన టైమ్ కు రాలేకపోతున్నాయి. దానికి కారణాలెన్నో. కొన్ని సినిమాలు షూటింగ్ వల్ల లేటైతే, మరికొన్ని సినిమాలు సీజీ, వీఎఫ్ఎక్స్ వల్ల లేటవుతూ వస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు షూటింగుల్లో జరిగే ప్రమాదాల వల్ల ఆలస్యమవుతున్నాయి.
అయితే ఈ మధ్య షూటింగుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నా మధ్య ప్రభాస్ గాయపడి అతని సినిమాల షూటింగుకు బ్రేక్ రాగా, రీసెంట్ గా సెట్ కాలిపోవడంతో కాంతార ప్రీక్వెల్ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ మూవీ జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరెవరిదో కాదు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ నటిస్తున్న కింగ్ సినిమా.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్లలో షారుఖ్ కూడా ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షారుఖ్ తన సినిమాలతో మూడు దశాబ్దాలుగా ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. 60 ఏళ్ల ఏజ్ లో కూడా షారుఖ్ డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అందులో భాగంగానే తన ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడానికి రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నారు షారుఖ్.
కాగా షారుఖ్ తన తర్వాతి సినిమా కోసం ఓ యాక్షన్ సీన్ కు సంబంధించిన షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి గాయాలపాలైనట్టు తెలుస్తోంది. షారుఖ్ నటిస్తున్న కింగ్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగిందని, ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో కింగ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఆ సీన్ కోసం వేసిన స్పెషల్ సెట్ లో షారుఖ్ గాయపడ్డారని సమాచారం.
అయితే ఈ ప్రమాదం గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ గాయం నేపథ్యంలోనే షారుఖ్ అత్యవసర ట్రీట్‌మెంట్ కోసం తన టీమ్ తో కలిసి అమెరికాకు వెళ్లారని అంటున్నారు. షూటింగ్ లో షారుఖ్ కు అయిన గాయం పెద్దది కాదని, కేవలం కండరాల గాయం మాత్రమేనని సమాచారం. కాగా షారుఖ్ గాయం కారణంగా కింగ్ సినిమాను సెప్టెంబరుకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కాగా కింగ్ మూవీలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈ మధ్య పెద్ద సినిమాల షూటింగుల్లో ఏదొక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకనైనా ఈ విషయంలో మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.