• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరు ఏళ్లలో పాతిక ఎలా...

ఆరు ఏళ్లలో పాతిక ఎలా కొట్టావ్‌ భయ్యా...!

| అలాంటి సమయంలో ఒక్కరు ఇద్దరు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-17 04:37 GMT

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి అంటూ వార్తల్లో చూడటం తప్ప ఈతరం హీరోలు అందుకోసం మినిమం ప్రయత్నిస్తున్న దాఖలాలు కూడా లేవు. అలాంటి సమయంలో ఒక్కరు ఇద్దరు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సినిమా మేకింగ్‌ కి పెరిగిన ఖర్చుల నేపథ్యంలో హీరోలు ఒకేసారి ఎక్కువ సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. మరో వైపు దర్శక నిర్మాతలు కూడా ఒకేసారి చాలా సినిమాలను రూపొందించేందుకు ధైర్యం చేయడం లేదు. అయితే విజయ్‌ సేతుపతి వంటి వారు మాత్రం ఏడాదికి అటు ఇటుగా అర డజను సినిమాలు లాగిస్తున్నారు.

ముఖ్యంగా విజయ్ సేతుపతి సినిమాల జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏడాదికి అయిదు పది సినిమాలు చేయడం అంటే మామూలు విషయమే. కానీ హీరోగా, విలన్ గా ఇంకా ముఖ్య పాత్రల్లో నటిస్తూ ఎక్కువ సినిమాలు చేస్తున్న ఘనత కేవలం విజయ్‌ సేతుపతికే దక్కింది.

హీరోగా ఒక వైపు వరుస సినిమాలు చేస్తూ మరో వైపు ఇతర పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతికి దక్కిన పాన్‌ ఇండియా గుర్తింపు కారణంగా అన్ని భాషల్లో కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. గడచిన ఆరు ఏళ్లలో ఏకంగా పాతిక సినిమాలు చేసి అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

తాజాగా విజయ్‌ సేతుపతి 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. తక్కువ సమయంలోనే పాతిక సినిమాలను చేయడం ద్వారా హాఫ్‌ సెంచరీ కి చాలా త్వరగా చేరవ అయ్యాడు. విజయ్‌ సేతుపతి జోరు చూస్తూ ఉంటే 2030 రాక ముందే సెంచరీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంత స్పీడ్‌ గా సినిమాలు ఎలా చేస్తున్నావు భయ్యా అంటూ ఆయన సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటూ ఉంటారట. ఆయన జోరుకు ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో చేసేస్తున్నాం అన్నట్లుగా కాకుండా మంచి సినిమాలను చేయడం ద్వారా అందరి అభిమానం దక్కించుకుంటున్నాడు.

Tags:    
  • Vijaysethupathi 
  • Filmindustry 
  • Maharajamovie 
  • Vijaysethupathicareer 
  • Panindiamovie 
  • Sethupathimoviesrecord 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS