సీనియర్ హీరోలు కథలను ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారా?

కానీ సెకండ్ ఆప్షన్ కోసం రామ్ చరణ్ కి చెబితే ఆయన ఈ జనరేషన్ కి తగ్గట్టుగా అందులో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందా అనే విధంగా సలహాలు ఏమైనా ఇస్తాడా అనే ధోరణిలో చిరంజీవి అతన్ని అడుగుతున్నాడట.

Update: 2026-10-01 05:43 GMT

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్న హీరోలకు మాత్రమే మంచి క్రేజ్ ఉంటుంది. ఎవరైతే లైమ్ లైట్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. స్టార్ డైరెక్టర్లు సైతం ఆ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నారు. అలాంటి నటులు ఇప్పుడు సీనియర్ హీరోలుగా మారి డిఫరెంట్ తరహా సబ్జెక్టులను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు... స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఈ సీనియర్ హీరోలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి... చిరంజీవి ఇప్పటికీ ఒక కథను తనే విని ఫైనల్ చేసినప్పటికి ఆ కథ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ ఒపీనియన్ కోసం రామ్ చరణ్ ను అడుగుతున్నారట... ఎలాగూ చిరంజీవి కథ ఓకే చేశాడు అంటే అది ఆల్మోస్ట్ అందరికీ నచ్చే విధంగా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ సెకండ్ ఆప్షన్ కోసం రామ్ చరణ్ కి చెబితే ఆయన ఈ జనరేషన్ కి తగ్గట్టుగా అందులో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందా అనే విధంగా సలహాలు ఏమైనా ఇస్తాడా అనే ధోరణిలో చిరంజీవి అతన్ని అడుగుతున్నాడట. మొత్తానికైతే చిరంజీవి ఇప్పటికీ ఒక మూవీ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు.

బాలయ్య విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఆయనకు సంబంధించిన ప్రతి స్క్రిప్ట్ ను తన చిన్న కూతురు 'తేజస్విని' చూసుకుంటుందట. అందుకే వరుసగా బాలయ్యకి మంచి సక్సెసు లైతే దక్కుతున్నాయని బాలయ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం... ఏది ఏమైనా కూడా తేజస్విని కి సినిమా ఇండస్ట్రీ మీద స్క్రిప్ట్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉందట. బాబీ లాంటి దర్శకుడు సైతం బాలయ్య కి 'డాకు మహారాజు' కథ చెప్పి ఆయన్ని ఒప్పించిన తరువాత ఆ మూవీ పూర్తి కథను ఒకసారి మా చిన్న కూతురు తేజస్విని కి చెప్పమని బాలయ్య బాబీ కి చెప్పాడట. దాంతో బాబీ బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తాన్ని తేజస్విని కి వినిపిస్తే ఆ కథ పూర్తిగా విన్న తేజస్విని అందులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని బాబీ కి కొన్ని సజేషన్స్ ఇచ్చిందట.

వెంకటేష్ మాత్రం ఏదైనా కథ విని అది ఆయనకి బాగా నచ్చితే బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురమ్మని డైరెక్టర్ కి చెప్తాడట. ఆ బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తాన్ని తను చదివి ఆ తర్వాత సినిమాని చేయాలా వద్దా అనే ఒక నిర్ణయానికైతే వస్తాడట. తన సినిమాల సెలక్షన్ విషయంలో తనే ఓన్ డిసిజన్ తీసుకుంటారట. ఒకసారి తనకి నచ్చితే ఇక ఫైనల్ అయినట్టే...

నాగార్జున విషయానికి వస్తే ఒక దర్శకుడు తనకి కథ చెప్పిన తర్వాత ఆ కథ గురించి ఆయన ఒక మూడు నాలుగు రోజులు ఆలోచిస్తాడట. ఆ తర్వాత స్క్రిప్ట్ గురించి ఆ దర్శకుడితో డిస్కస్ చేస్తారట. కొత్త దర్శకుడు వచ్చి నాగార్జునకు కథ చెప్పినా కూడా నాగార్జునకి స్టోరీ నచ్చితే ఆ కొత్త డైరెక్టర్ ఈ సినిమాని ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అనేది తెలుసుకోవడానికి కొద్ది రోజులపాటు ఆ దర్శకుడిని తనతో ట్రావెల్ అవ్వమని చెబుతాడట. ఆ ప్రాసెస్ లో ఆ దర్శకుడి యొక్క పొటాషియాలిటీ ఏంటో తెలుసుకుంటాడు. మొత్తానికైతే నాగార్జున ఇప్పటి వరకు కొంతమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీ కి పరిచయం చేసి సక్సెస్ లను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి...

Tags:    

Similar News