'క్రేజీ కళ్యాణం'తో అనుపమ కన్ఫ్యూజన్ తొలగి పోయేనా?
మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే సౌత్‌లోని అన్ని భాషల్లో నటించి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
మలయాళ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే సౌత్‌లోని అన్ని భాషల్లో నటించి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటింది. ఈ పదేళ్లలో అనుపమ ఎన్నో విజయాలు, అంతకు మించిన పరాజయాలు చవిచూసింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ఆమె సినిమాల ఎంపిక విషయంలో నిర్ణయాలను కొందరు కన్ఫ్యూజ్ అవుతుంది అంటూ విమర్శిస్తున్నారు. ఒక వైపు హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ను చేయడం ఏంటంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. గత కొంత కాలంగా అనుపమ పరమేశ్వరన్ సినిమాల ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతో ఆమె తీరును కొందరు తప్పుబడుతున్నారు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా...
సాధారణంగా హీరోయిన్స్ కమర్షియల్ సినిమా ఆఫర్లు వచ్చేప్పుడు, స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వచ్చేప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే హీరోలకు జోడీగా ఆఫర్లు రావో అప్పుడే లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు చూడటం పరిపాటిగా వస్తుంది. ఈతరం హీరోయిన్స్, అంతకు ముందు హీరోయిన్స్ అంతా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఒక వైపు హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటిస్తూ మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ వస్తోంది. ఒకటి రెండు అంటే పర్వాలేదు కానీ వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంను అనుపమ పరమేశ్వరన్ అభిమానులు సైతం కొందరు తప్పుబడుతున్నారు. అందంతో పాటు మంచి క్రేజ్ ఉన్న ఈ సమయంలో కష్టపడి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాల్సిన అవసరం ఏంటో అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
క్రేజీ కళ్యాణం సినిమాతో అనుపమ...
సరే అనుపమ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి, వాటితో అనుపమ భారీగా క్రేజ్ దక్కించుకుంటుంది అంటే అది కూడా లేదు. ఆమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ శాతం కమర్షియల్‌గా డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి, వచ్చిన ఆఫర్లను ఆమె కమిట్ అవుతుంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన 'క్రేజీ కళ్యాణం' సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ నెలలో విడుదల కాబోతున్న క్రేజీ కళ్యాణం సినిమాపై అనుపమ చాలా ఆశలు పెట్టుకుంది. పెళ్లి విషయమై తండ్రితో విభేదించే అమ్మాయి పాత్రలో అనుపమ కనిపించబోతుంది. సినిమా స్టోరీ లైన్ డిఫరెంట్‌గా ఉంది, కానీ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనేది చూడాలి. ఈ సినిమాతో హిట్ కొడితే పర్వాలేదు, లేదంటే అనుపమ మరోసారి గట్టి ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందని అంటున్నారు.
శర్వానంద్ భోగి సినిమా...
హీరోలకు జోడీగా వరుస సినిమాలు చేయాలని అనుపమ అభిమానులు కోరుకుంటున్నారు. అనుపమ మాత్రం రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తోంది. ఒక వైపు హీరోలకు జోడీగా కమర్షియల్ పాత్రలు చేస్తూ, మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. క్రేజీ కళ్యాణం సినిమా ఫలితాన్ని బట్టి అనుపమ ఏ సినిమాలు చేస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెండు పడవల ప్రయాణం విషయంలో అనుపమకు ఉన్న కన్ఫ్యూజన్ క్లీయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, క్రేజీ కళ్యాణం ఫలితం కోసం ఆమె ఎదురు చూస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రేజీ కళ్యాణం సినిమాతో పాటు శర్వానంద్‌కు జోడీగా అనుపమ భోగి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భోగి హిట్ అయితే అనుపమ వరుసగా హీరోలతో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అనుపమ అడుగులు ఎటు వైపుకు వెళ్లనున్నాయి, ఆమె కన్ఫ్యూజన్ తొలగి పోయేనా అనేది చూడాలి.