20 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. ఫైనల్లీ తెరపై ఆ జోడీ!
ప్రియాంక చోప్రా సినిమా ప్రస్తుతం తెలుగు మూవీ 'వారణాసి'లో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.
ప్రియాంక చోప్రా సినిమా ప్రస్తుతం తెలుగు మూవీ 'వారణాసి'లో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటించడం పట్ల ప్రియాంక చోప్రా చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. గత ఆరు ఏళ్లలో ప్రియాంక చోప్రా ఇండియన్ మూవీస్‌కి కమిట్ అయిందే లేదు. ఎక్కువగా అమెరికన్ వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. వారణాసి సినిమాతో దిగి వచ్చిన ప్రియాంక చోప్రా ఇకపై హాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలను సైతం చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ప్రియాంక చోప్రా హిందీ నుంచి వస్తున్న ఆఫర్లు సున్నితంగా తిరస్కరిస్తుందట.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్...
బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించింది కానీ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌తో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు, పలు అవార్డ్‌లు దక్కించుకున్న దర్శకుడు రితేష్ బాత్రా దర్శకత్వంలో ఒక ఇంటర్నేషనల్ మూవీ రూపొందబోతుందట. ఆ సినిమాలో ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా అనుకున్నాడు. తన గత చిత్రాల మాదిరిగానే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రితేష్ ఈ కొత్త సినిమాను తీయబోతున్నట్లు చెబుతున్నారు. కమర్షియల్ ఫలితం పక్కన పెడితే అవార్డ్ విన్నింగ్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ సినిమాలో ఇప్పటి వరకు కలిసి నటించని ప్రియాంక చోప్రా, సైఫ్ అలీ ఖాన్ ఇంటర్నేషనల్ మూవీ కోసం మాత్రం కలిసి వర్క్ చేయబోతున్నారు.
ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా...
ప్రియాంక చోప్రా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. పీసీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సైఫ్ అలీ ఖాన్ ఫుల్ ఫామ్‌లో హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రియాంక చోప్రాతో ఆయన కలిసి నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు పలు సార్లు వచ్చాయి. కానీ వీరి కాంబో ప్రాజెక్ట్‌లు రెండు మూడు చర్చల దశలో ఆగిపోతే, మరికొన్ని వార్తలకే పరిమితం అయ్యాయి. మొత్తానికి వీరిద్దరు ఎప్పుడు కలిసి నటిస్తారా అని బాలీవుడ్ వర్గాల వారు, ప్రేక్షకులు దాదాపు 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా రితేష్ బాత్రా దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాతో వీరిద్దరు జత కట్టబోతున్నారు. వీరి కాంబో కి కచ్చితంగా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వీరి కాంబో మూవీ ఇంగ్లీష్ లో రూపొందినా, హిందీలో విడుదల చేయాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. మరి హిందీలో ఆ సినిమా వచ్చేనా చూడాలి.
హాలీవుడ్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా జంటగా...
ఈమధ్య కాలంలో సైఫ్ అలీ ఖాన్ వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్నాడు. హీరోగానూ హిట్ కొట్టలేక, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఆఫర్లు రాకపోవడంతో కెరీర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో సైఫ్ అలీ ఖాన్ కి ప్రియాంక చోప్రాతో ఏకంగా ఇంటర్నేషణల్ మూవీలో నటించే అవకాశం రావడం అనేది కచ్చితంగా మంచి అవకాశం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఉన్న ఫామ్ నేపథ్యంలో రితేష్ తీయబోతున్న మూవీ కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది, అంతే కాకుండా సైఫ్ కి నటుడిగా హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు తెచ్చి పెట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ జోడీ తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో ఆ తర్వాత పరిణామాలు ఏంటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.