ఫస్టాఫ్ సూపర్ హిట్ సెకండాఫ్ డల్ అయిన సినిమాలు...
సినిమాలని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లకున్న ప్రాబ్లమ్స్ నుంచి కనీసం కొద్దిసేపైన రిలాక్సేషన్ దొరుకుతుందేమోననే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు.
సినిమాలని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లకున్న ప్రాబ్లమ్స్ నుంచి కనీసం కొద్దిసేపైన రిలాక్సేషన్ దొరుకుతుందేమోననే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు. అలాంటి ప్రేక్షకులు ఒక సినిమాని చూసి అది ఎలా ఉంది అనే విషయం మీద ఇతరులతో చర్చిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ బాధలను మర్చిపోవడానికి సినిమాకి వచ్చిన ప్రేక్షకులు మూడు గంటలపాటు ఎంజాయ్ చేసే విధంగా సినిమాలు ఉండాలి కానీ ఆల్రెడీ బాధల్లో ఉన్న ఆడియన్స్ ను మూవీ మరింత ఇబ్బంది పెట్టకూడదు. ఈ ఒక్క విషయాన్ని దర్శకులు హీరోలు ఫాలో అయితే అన్ని సక్సెస్ ఫుల్ సినిమాలే వస్తాయి తప్ప ఫెయిల్యూర్ సినిమాలైతే రావు అనేది చాలామంది వాదన... ఇక ఇదిలా ఉంటే కొంతమంది దర్శకులు చేసిన సినిమాలు ఫస్టాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి డల్ అయిపోతుంటాయి. దానివల్ల సినిమా రిజల్ట్ కూడా తేడా కొడుతుంది. ఫస్టాఫ్ హైలెట్ గా ఉండి సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయిన సినిమాలేంటో ఒకసారి మనం తెలుసుకుందాం...
కృష్ణగాడి వీర ప్రేమగాద
నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. అలాగే నాని యాక్టింగ్ తో సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. నాని, సత్యం రాజేష్ మధ్యన వచ్చే చిన్న చిన్న కామెడీ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకుడిలో ఒక ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంటాయి. హీరో తను ప్రేమించిన విషయాన్ని హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఎలా చెబుతాడు అనేది ఒక హుక్ లైన్ లా పెట్టుకొని ఫస్టాఫ్ మొత్తాన్ని నడిపించారు. ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి హీరో గోల్ మారిపోతుంది. ఫస్టాఫ్ హీరోయిన్ ప్రేమ పొందితే చాలు అనుకునేవాడికి సెకండాఫ్ లో కొంతమంది ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదంతా కొంచెం గందరగోళంగా ఉండడంతో ఫస్టాఫ్ ఒక మంచి లవ్ స్టోరీ తో స్టార్ట్ చేసి సెకండాఫ్ అంత యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. అందుకే మూవీ ఆవరేజ్ హిట్ గా నిలిచింది. సెకండాఫ్ ను పర్ఫెక్ట్ గా డీల్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది...
పంజా
పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'పంజా' సినిమా ఫస్టాఫ్ మొత్తం చాలా స్టైలిష్ గా ఉంటూనే కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఒక మాఫియా డాన్ లాగా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అవన్నీ ప్రేక్షకుడిలో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలనే చెప్పాలి. ఎప్పుడైతే సెకండాఫ్ స్టార్ట్ అయిందో అప్పుడు సినిమాను విలేజ్ లోకి తీసుకెళ్లి అక్కడ మూవీని నడిపిస్తారు. ఆ విలేజ్ ఎపిసోడ్స్ మొత్తం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. అవి ఈ మాత్రం ఎంటర్ టైన్ చేయకపోగా ప్రేక్షకుడికి ఒకానొక సమయంలో విసుగును కూడా తెప్పించినా పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా ఫస్టాఫ్ ఇచ్చినంత హై సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోయింది. దాని వల్ల సినిమా అనుకున్న మేరకు సక్సెస్ అయితే సాధించలేదు...
పడి పడి లేచే మనసు
శర్వానంద్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'పడి పడి లేచే మనసు' మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక బెస్ట్ లవ్ స్టోరీ గా ముందుకు సాగుతుంది. ఫస్టాఫ్ లో వచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. లవ్ స్టోరీ లో ఈ సినిమా ఒక బెంచ్ మార్కును సెట్ చేస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఇక ఫస్టాఫ్ ముగిసే సమయానికి సినిమాలో ఉన్న లవ్ స్టోరీ చాలా టాప్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సెకండాఫ్ ఇదే రేంజ్ లో ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అనుకున్న ప్రతి ఒక్కరికి సెకండ్ హాఫ్ తో దర్శకుడు కొంతవరకు షాక్ కి గురి చేశాడు. సెకండ్ హాఫ్ లో నేపాల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను నడిపించాడు. సైకలాజికల్ గా హీరోయిన్ కి మెమొరీ లాస్ ఉందనే విషయాన్ని అప్పటిదాకా ఎక్కడ ప్రస్తావించకుండా ఒకేసారి ట్విస్ట్ లాగా దానిని రివిల్ చేయడంతో ప్రేక్షకులు దానిని జీర్ణించుకోలేకపోయారు. దాంతో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయింది... ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ కూడా పలు సందర్భాల్లో తెలియజేశాడు. తను ఏదైతే ట్విస్ట్ ప్రేక్షకుడికి హై ఇస్తుందని అనుకున్నాడో అది పర్ఫెక్ట్ గా కన్వే కాలేదని అదే మూవీకి మైనస్ అయిందని చెప్పాడు. ఇక మొత్తానికైతే హను రాఘవపూడి చేసిన వరుస సినిమాల్లో సెకండాఫ్ డల్ అవుతుందని తెలుసుకున్న ఆయన 'సీతా రామం' సినిమాలో సెకండాఫ్ మీద చాలా ఎక్కువ వర్క్ చేశారట. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది...