కమెడియన్స్‌ హీరోగా.. ఆ మ్యాజిక్ పనిచేస్తుందా?

సత్య, యోగిబాబు.. ఇద్దరికి తమ తమ ఇండస్ట్రీల్లో మంచి కామెడీ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇద్దరినీ ఒకే సినిమాలో లీడ్స్‌గా పెట్టి ‘గోల్డెన్ భాగ్యం’ చేస్తున్నారు.

Update: 2026-10-01 05:09 GMT

సత్య, యోగిబాబు.. ఇద్దరికి తమ తమ ఇండస్ట్రీల్లో మంచి కామెడీ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇద్దరినీ ఒకే సినిమాలో లీడ్స్‌గా పెట్టి ‘గోల్డెన్ భాగ్యం’ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లోనే తెలుగు-తమిళ మిక్స్‌తో ‘తెలుమిళ్’ అనే కాన్సెప్ట్ చూపించారు. సత్య తమిళంలో, యోగిబాబు తెలుగులో మాట్లాడే సెటప్ పెట్టడంతో మొదటి నుంచే కామెడీని హైలెట్ చేశారు.

సత్యకు లీడ్ రోల్ రావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో ‘వివాహ భోజనంబు’లో లీడ్ చేశారు. ఈ ఏడాది రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ‘జెట్‌లీ’లో కూడా కథ మొత్తాన్ని ఆయన పాత్ర చుట్టూనే నడిపించారు. సత్య టైమింగ్‌పై మంచి కామెంట్స్ వచ్చినా, సినిమా రైటింగ్ మాత్రం మిక్స్‌డ్ రియాక్షన్ తెచ్చుకుంది. అంటే సత్య కామెడీపై ఆడియన్స్‌కు నమ్మకం ఉంది కానీ, పూర్తి సినిమాను నిలబెట్టేది కథే.

యోగిబాబు ఈ రూట్‌లో ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేశారు. ‘మండేలా’లో పూర్తి స్థాయి లీడ్‌గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘బొమ్మై నాయగి’లో కామెడీ కంటే ఎమోషన్ ఎక్కువ ఉన్న పాత్ర చేశారు. ‘బోట్’లో కూడా కథ మధ్యలో నిలిచే పాత్ర ఆయనదే. అంటే యోగిబాబు లీడ్‌గా వర్కౌట్ కావాలంటే ప్రతి సారి కామెడీ అవసరం లేదని ఆయన చేసిన సినిమాలే చూపించాయి.

ఇదే ‘గోల్డెన్ భాగ్యం’లో ఏదైనా డ్రామా ఎమోషన్ టచ్ ఉంటుందా అన్నది అసలు పాయింట్. సత్యకు తెలుగులో ఉన్న కామెడీ క్రేజ్, యోగిబాబుకు తమిళంలో ఉన్న గుర్తింపు రెండింటినీ ఒకే కథలో వాడుతున్నారు. పైగా భాష తేడానే ఫన్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్లింప్స్ వరకైతే బాగానే పని చేస్తోంది. కానీ పూర్తి సినిమాలో ఇదే సెటప్ ఎంతవరకు నిలబడుతుందన్నది ఇంపార్టెంట్.

సత్య ‘జెట్‌లీ’లో కామెడీ ఉన్నా రైటింగ్ మీదే ఎక్కువ విమర్శలు వచ్చాయి. యోగిబాబు లీడ్ సినిమాల్లో కూడా ‘మండేలా’, ‘బొమ్మై నాయగి’లాంటి వాటికి కథ, పాత్రే ప్రధాన బలం అయ్యాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇద్దరి టైమింగ్ కంటే వాళ్ల చుట్టూ రాసిన కథే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న ‘గోల్డెన్ భాగ్యం’లో ఈ ఇద్దరి కాంబినేషన్‌నే మెయిన్ అట్రాక్షన్‌గా పెట్టారు. ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కావడంతో మొదటి క్యూరియాసిటీ రావచ్చు. ఇప్పుడు ఆ ఇద్దరినీ కలిపిన సినిమా కూడా అదే స్థాయిలో నవ్విస్తుందా, లేక గ్లింప్స్ వరకే ఈ కాంబినేషన్ బాగుంటుందా అన్నది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

Tags:    

Similar News