శేఖర్ కమ్ములా విమర్శకులు వాళ్లే!
డైరెక్టర్ గా శేఖర్ కమ్ములాకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇంతవరకూ క్లాసిక్ సెన్సిబుల్ చిత్రాలతోనే ప్రేక్షకులను ఆలరించారు.;
డైరెక్టర్ గా శేఖర్ కమ్ములాకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇంతవరకూ క్లాసిక్ సెన్సిబుల్ చిత్రాలతోనే ప్రేక్షకులను ఆలరించారు. `ఆనంద్` నుంచి `లవ్ స్టోరీ` వరకూ అన్నింటిలోనూ తనదైన మార్క్ సెన్సిబిలిటీ కనిపిస్తుంది. కానీ తొలిసారి కుబేర చిత్రాన్ని గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు. ఇంత వరకూ ఆయన టచ్ చేయని పాయింట్ ఇది. దీంతో సినిమాలో శేఖర్ మార్క్ ఎలా హైలైట్ అవుతుందని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్లో తన మార్క్ సెన్సిబిలిటీ మాత్రం హైలైట్ అయింది. గ్యాంగ్ స్టర్ నేపథ్యమైనా సెన్సిబిలిటీని మాత్రం మిస్ అయినట్లు లేదు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ తన కుటుంబం నుంచే వస్తుందని శేఖర్ కమ్ములా మాటలను బట్టి తెలుస్తోంది. తన సినిమాలకు బయటి వారు ఎవరో విమర్శకులు కాదు అని తన భార్య పిల్లలు అని కమ్ములా తెలిపారు.
సినిమాకు సంబంధించిన పనులు లేకపోతే శేఖర్ కమ్ములా ఉన్న సమయాన్ని కుటుంబంతోనే గడుపు తాడుట. భార్య శ్రీవిద్య , పాప వందన, బాబు విభవ్ తన సినిమాలకు విమర్శకలుగా పేర్కొన్నారు. అంటే మణిరత్నం తరహాలోనే కమ్ములాకు ఇంట్లోనే క్రిటిక్స్ దొరికారు. మణిరత్నం ఏ సినిమా తీసిన చూసి ఆ సినిమాను రివ్యూ చేసేది సుహాసిని. ఎంత రేటింగ్ ఇవ్వాలన్నది ఆమె డిసైడ్ చేస్తారు.
ఇంత వరకూ మణిరత్నం సంతృప్తి చెందే రేటింగ్ ఏ సినిమాకు ఇవ్వలేదు. ఇటీవలే విడుదలైన `థగ్ లైఫ్` తోనైనా సాధ్యమవుతుందనుకుంటే? ఆ సినిమా కూడా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఇక తేలాల్సింది కమ్ములా `కుబేర` సంగతే. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.