బన్నీతో సీరత్ కపూర్.. హీరోయిన్ గట్టి క్లాస్ పీకిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీ సీరత్ కపూర్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2026-05-12 09:33 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీ సీరత్ కపూర్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా సీరత్ షేర్ చేసిన ప్రైవేట్ జెట్ ఫోటోలు, వాటిపై వచ్చిన కామెంట్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్ కు సీరత్ ఇచ్చిన ఘాటు సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇటీవల అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా సీరత్ కపూర్ సోషల్ మీడియాలో బన్నీతో కలిసి ప్రైవేట్ జెట్‌ లో దిగిన కొన్ని అ న్‌సీన్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. "హ్యాపీ బర్త్‌ డే బన్నీ.. మీరు మీ కళను, సంబంధాలను ఎంతో సహజంగా, హుందాగా బ్యాలెన్స్ చేస్తారు. తెరపై, తెర వెనుక మరిన్ని విజయాలు అందుకోవాలి" అంటూ ఆమె పోస్ట్ చేసింది.

చివర్లో లవ్ సింబల్ కూడా యాడ్ చేసింది. అయితే సీరత్ కపూర్ పోస్ట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. తాజాగా సీరత్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో మరో ఫోటో షేర్ చేయగా, ఓ నెటిజన్ లిమిట్స్ క్రాస్ చేసి అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై ఇప్పుడు సీరత్ ఫుల్ ఫైర్ అయ్యి గట్టి క్లాస్ పీకారు.

"చివర్లో హార్ట్ ఎమోజీ పెట్టినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు గౌరవప్రదంగా మారిపోవు సార్. ఒక మహిళ ఎప్పటికీ ఎవరి ఆస్తి కాదు. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం, కలలు, స్వరం ఉంటాయి. గౌరవించడం నేర్చుకోండి. కానీ ఇలా ప్రాపర్టీ రైట్స్ ఉన్నట్లు మాట్లాడొద్దు" అంటూ ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అయితే సీరత్ ఇచ్చిన సమాధానానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

మహిళలను వస్తువుల్లా చూడటం సరైంది కాదని, వ్యక్తిగత గౌరవం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆమె చెప్పిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. పలువురు నెటిజన్లు కూడా సరైన సమాధానం ఇచ్చారని, ఇలాంటి కామెంట్లకు ఇదే కరెక్ట్ కౌంటర్ అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కేవలం ఫ్రెండ్లీ పోస్టును తప్పుగా అర్థం చేసుకుని అనవసరమైన రూమర్లు క్రియేట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహమే తప్ప మరేదీ కాదని టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా బన్నీ- సీరత్ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే సీరత్ కపూర్ 2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టైగర్, రాజు గారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీల, భామాకలాపం 2, మనమే వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News