సినిమాలను ట్రంప్ వేలు పెట్టి కెలుకుతున్నాడా?

అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 వేదికగా హాలీవుడ్ నటుడు సెబాస్టియన్ స్టాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Update: 2026-05-19 19:30 GMT

అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 వేదికగా హాలీవుడ్ నటుడు సెబాస్టియన్ స్టాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్‌లో ఆయన పాత్రను పోషించిన సెబాస్టియ‌న్ ఈ వేదికపై రాజకీయాలు - భావప్రకటన స్వేచ్ఛ గురించి ఎంతో నిర్భయంగా మాట్లాడారు. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, కళలపై జరుగుతోన్న ఆంక్షలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ వంటి శక్తివంతమైన నేతల చుట్టూ ఉండే కథలను వెండితెరపై ఆవిష్కరించడం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆయన వివరించారు. రాజకీయ నాయకులు తమ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి వ్యవస్థలను ఎలా వాడుకుంటారో చెప్తూ ట్రంప్ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందనే కోణంలో మాట్లాడారు. రాజకీయ విమర్శలతో పాటు, ప్రస్తుతం అమెరికాలో మారుతోన్న సామాజిక పరిస్థితులు - సెన్సార్‌షిప్ పై సెబాస్టియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్వేచ్ఛకు, భిన్నత్వానికి మారుపేరుగా నిలిచిన అమెరికాలో ఇప్పుడు కథలు చెప్పే విధానంపై కళాకారుల ఆలోచనలపై అదృశ్య సెన్సార్‌షిప్ నడుస్తోందని ఆరోపించారు.

వివాదాస్పద లేదా రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలను నిర్మించడానికి వాటిని ప్రేక్షకులకు చూపించడానికి మేకర్స్ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. `మనం ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం అంటూ అమెరికా సమాజానికి , చిత్ర పరిశ్రమకు హెచ్చరిక లాంటి సందేశాన్ని ఇచ్చారు. నిజాలను నిర్భయంగా మాట్లాడే వాతావరణం క్రమంగా తగ్గిపోతోందని, భయం , ఆంక్షల నీడలో కళలు వర్ధిల్లలేవని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ఒక హాలీవుడ్ స్టార్ నటుడు గ్లోబల్ వేదికపై ఇంత ఓపెన్‌గా తమ దేశంలోని లోపాలను ఎండగట్టడం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సెబాస్టియన్ స్టాన్ నటించిన బయోపిక్ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి ఎన్నో వివాదాలను, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. ట్రంప్ వర్గం ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించిందనే వార్తల నేపథ్యంలో కాన్స్ వేదికగా సెబాస్టియన్ ఇచ్చిన కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా అనేది వినోదం మాత్రమే కాదని సమాజంలోని సత్యాలను, రాజకీయ నాయకుల అసలు ముఖాలను ప్రతిబింబించే అద్దం ఈ సందర్భంగా బలంగా నొక్కి చెప్పారు. ఈ పవర్‌ఫుల్ వ్యాఖ్యలు హాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ మేకర్లలో చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశాలలో భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు. క‌ళా రంగంలో కూడా ట్రంప్ వేలు పెట్ట‌డం..సెన్సార్ పేరిట రిలీజ్ అయ్యే చిత్రాల విష యంలో ట్రంప్ మొండి వైఖ‌రితో ఎంతో మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, క్రియేట‌ర్లు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News