స్ట్రాంగ్ ప్లాన్‌ తో 'సేవ్ ది టైగర్స్ 3'.. ఈసారి ట్రిపుల్ నవ్వులు పక్కా..

పెళ్లి జీవితం గురించి సరదాగా మాట్లాడుకుంటున్న ఆ ముగ్గురు స్నేహితుల జీవితాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడం కథలో కీలకంగా కనిపిస్తోంది.

Update: 2026-05-30 17:59 GMT

తెలుగు ఓటీటీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫ్యామిలీ కామెడీ వెబ్‌ సిరీస్ సేవ్ ది టైగర్స్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లతో మెప్పించిన ఆ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఆ సిరీస్‌ సీజన్ 3 ట్రైలర్ తాజాగా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది.

మొదటి రెండు సీజన్లలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు ఫన్నీగా చూపించి ప్రేక్షకులను అలరించిన మేకర్స్, ఈసారి కథలో కొత్త యాంగిల్ ను యాడ్ చేసినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కామెడీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ ను మిక్స్ చేస్తూ కథను మరింత ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుంచి నవ్వులు పూయించే డైలాగులతో ఆకట్టుకుంటోంది. రాహుల్, విక్రమ్, ఘంటా రవి పాత్రలు తమదైన కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

పెళ్లి జీవితం గురించి సరదాగా మాట్లాడుకుంటున్న ఆ ముగ్గురు స్నేహితుల జీవితాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడం కథలో కీలకంగా కనిపిస్తోంది. ఈసారి స్టోరీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వెన్నెల కిషోర్ ఎంట్రీ. ఇంద్రుడి పాత్రలో ఆయన కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. స్వర్గలోకం నేపథ్యంలో సాగే కొన్ని సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇంద్రుడి ఎంట్రీ తర్వాత ముగ్గురు హీరోల జీవితాలు పూర్తిగా మారిపోతాయి.

సాధారణ వ్యక్తులుగా ఉన్న వారు ఒక్కసారిగా బెస్ట్ పొజిషన్ కు చేరుకోవడం కథలో ఆసక్తి పెంచుతోంది. ఘంటా రవి రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా మారడం, రాహుల్ ప్రముఖ స్క్రీన్‌ ప్లే రైటర్ గా ఎదగడం, విక్రమ్ పెద్ద కంపెనీకి సీఈవో కావడం వంటి పరిణామాలు ట్రైలర్‌ లో కనిపించాయి. అయితే ఆ మార్పులు ఎలా జరిగాయి? వీటి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం సిరీస్‌ లోనే తెలుస్తుందనే ఆసక్తిని మేకర్స్ కలిగించారు.

రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చెబుతోంది. ఆ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో పాటు కామెడీని మరింత కొత్తగా చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ట్రైలర్‌ లో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా తగ్గలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 'ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్ధాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి' అంటూ ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ తమ పాత్రల్లో మరోసారి మెప్పించనున్నట్లు కనిపిస్తుండగా, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ కూడా తమ రోల్స్ తో ఆకట్టుకోనున్నారు. వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఆ సిరీస్‌ ను శ్రీరామ్ ఎరగం తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ కు ఫాంటసీ టచ్ యాడ్ చేస్తూ రూపొందించిన కొత్త సీజన్‌ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. గత రెండు సీజన్ల సక్సెస్ ను కొనసాగిస్తూ.. ఈసారి మరింత భారీ రేంజ్ లో నవ్వులు పంచేందుకు సేవ్ ది టైగర్స్ 3 సిద్ధమైనట్లు ట్రైలర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News