ఫైనల్లీ ఆన్ స్క్రీన్ దాదా కన్ఫర్మ్
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై పదుల సంఖ్యలో బయోపిక్‌లు వచ్చాయి. అందులో క్రికెటర్స్ బయోపిక్‌లు అత్యధికంగా ఉన్నాయి.;
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై పదుల సంఖ్యలో బయోపిక్‌లు వచ్చాయి. అందులో క్రికెటర్స్ బయోపిక్‌లు అత్యధికంగా ఉన్నాయి. రచయితలు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, సినిమా స్టార్స్ ఇలా ఎన్నో రంగాలకు చెందిన వారి బయోపిక్‌లు వచ్చాయి. అయితే క్రికెటర్స్ బయోపిక్‌లకు ఉన్నంత క్రేజ్ మరే బయోపిక్‌లకు ఉండదు అనడంలో సందేహం లేదు. ప్రముఖ క్రికెటర్స్ యొక్క బయోపిక్ మూవీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ యొక్క బయోపిక్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్‌గా భారీ వసూళ్లు రాబట్టడం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే మరిన్ని బయోపిక్‌లు క్యూ కడుతున్నాయి.
చాలా కాలంగా టీం ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దాదా సౌరవ్ గంగూలీ యొక్క బయోపిక్ రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. గంగూలీ సైతం పలు ఇంటర్వ్యూల్లో తన బయోపిక్ వస్తుందని, అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సినిమాను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఇటీవల హీరో రాజ్ కుమార్ రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సౌరవ్ గంగూలీ యొక్క బయోపిక్‌లో నటించబోతున్నాను, గంగూలీ మాదిరిగా బ్యాటింగ్ చేసేందుకు గాను ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
కొన్ని వారాల క్రితం గంగూలీ సైతం తన పాత్రకు గాను రాజ్ కుమార్ రావు నటిస్తే బాగుంటుందని, అన్ని రకాలుగా అతడు తన పాత్రకు బాగా సూట్ అవుతాడని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఫిజిక్ పరంగా, ఎత్తు, ఇతర విషయాలు అన్నింటిలోనూ గంగూలీకి రాజ్ కుమార్ రావు డూప్ అన్నట్లుగా ఉంటాడు. అందుకే అతడిని ఈ పాత్రకు ఎంపిక చేసి ఉంటారని తెలుస్తోంది. మొదట ఈ పాత్రను చేయడం కోసం టెన్షన్ పడ్డాను, అడిగిన సమయంలో వెంటనే ఓకే చెప్పేందుకు వెనకాడాను, కానీ నాకు నమ్మకం కలిగించి కచ్చితంగా చేయగలవు అనే ప్రోత్సాహం లభించడంతో రెడీ అయ్యాను అన్నాడు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క క్రీడా ప్రేమికుడిని అలరిస్తుందనే విశ్వాసం ను వ్యక్తం చేశాడు.
2026 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. అదే ఏడాది అంటే 2026 డిసెంబర్ నెలలో సినిమాను దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. హిందీలో రూపొందబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసేందుకు గాను ముందు నుంచే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న గంగూలీ తన కెరీర్ మొత్తంలో 18500 పరుగులు చేయడం జరిగింది. ఇండియన్ క్రికెట్‌కు అద్భుతమైన విజయాలను అందించడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎంతో మంది కొత్త క్రికెటర్స్ వచ్చారు, ఇక బీసీసీఐ బాస్‌గానూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే ఆయన సినిమా కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.