• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవరకు పోటీగా అలాంటి...

దేవరకు పోటీగా అలాంటి సినిమా..?

| కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి

By - Tupaki Desk
Update: 2024-09-21 03:57 GMT

ఎన్టీఆర్ దేవర మరో వారం రోజుల్లో ఆగమనం కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో తారక్ తో జాన్వి కపూర్ జత కట్టింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా దేవర భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఐతే దేవర సినిమాకు పోటీగా తమిళ్ లో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ ఆంటోని హిట్లర్ కాగా మరోటి కార్తీ హీరోగా వస్తున్న సత్యం సుందరం. 96 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సత్యం సుందరం. సినిమా టీజర్ తోనే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.

ఐతే ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. దేవరకు పోటీగా అంటే ఒకరోజు తర్వాత రిలీజ్ అవుతున్న సత్యం సుందరం సినిమా లో సాంగ్స్, ఫైట్స్ ఏవి ఉండవట. ఈ విషయాన్ని ఆ సినిమా హీరో కార్తీ చెప్పడం విశేషం. అసలు ఈ టైం లో సాంగ్స్, ఫైట్స్ లేకుండా సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ ప్రేమ్ కుమార్ వాటికి మించి మంచి కథతో వస్తున్నాడని తెలుస్తుంది.

ఓ పక్క ఎన్టీఆర్ దేవర మాస్ కంటెంట్ తో వస్తుంది. దానికి పోటీగా కార్తీ సత్యం సుందరం మాత్రం నో ఫైట్స్ అంటూ వస్తున్నారు. మరి రెండు సినిమాల మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలుగులో కూడా సత్యం సుందరం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ సినిమాకు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. దేవర టాక్ అటు ఇటైతే తప్ప విజయ్ ఆంటొని హిట్లర్, కార్తీ సత్యం సుందరం సినిమాలను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించదు. మరి ఈ 3 సినిమాల ఫలితం ఎలా ఉంటుందో ఈ నెల 27, 28న తెలుస్తుంది.

Tags:    
  • Karthi 
  • Arvindswamy 
  • Satyamsundaram 
  • Devara 
  • NTR 
  • Koratalasiva 
  • Hitlermovie 
  • Janhvikapoor 
  • Premkumar 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS