• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్‌ను దాటేసిన కార్తి

ప్రభాస్‌ను దాటేసిన కార్తి

| ఇందులో కూడా కార్తి చిత్రానికి ఎవరూ ఊహించని రీతిలో భారీ స్థాయిలో రెస్పాన్స్ సొంతం అయింది.

By - Tupaki Desk
Update: 2024-11-01 08:18 GMT

సౌత్ ఇండియా మొత్తంలో ఎంతో మంది హీరోలు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సూర్య తమ్ముడు కార్తి ఒకడు. నేచురల్ యాక్టింగ్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే, ఈ మధ్యన సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కార్తి నటించిన లేటెస్ట్ మూవీనే ‘సత్యం సుందరం’.

కోలీవుడ్ స్టార్ కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘సత్యం సుందరం’. సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ఈ ఎమోషనల్ మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ లభించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి తమిళం, తెలుగులో కూడా ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ మూవీ థియేటర్లలో మంచి ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే దీన్ని ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ ఎమోషనల్ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కూడా కార్తి చిత్రానికి ఎవరూ ఊహించని రీతిలో భారీ స్థాయిలో రెస్పాన్స్ సొంతం అయింది.

కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా ఇది మొదటి వారంలోనే 1.9 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఎక్కువ మంది వీక్షించిన ఇండియన్ సినిమాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ (1.7 మిలియన్స్), సలార్ హిందీ (1.6 మిలియన్స్) చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది.

ఓటీటీల్లో మొదటి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇందులో ‘కల్కి 2898 ఏడీ’ హిందీ వెర్షన్ 4.5 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం’ 3.8 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో, ‘గుంటూరు కారం’, ‘హాయ్ నాన్న’ 2 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచాయి.

‘సత్యం సుందరం’ సినిమాకు ఓటీటీలో సైతం ప్రశంసల వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కార్తి, అరవింద స్వామి నటనకు ఓ రేంజ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఇక, ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య నిర్మించారు. ఇందులో రాజ్‌ కిరణ్, శ్రీ దివ్య, దేవ దర్శిణి తదితరులు నటించారు.

Tags:    
  • Prabhas 
  • Karthi 
  • Satyamsundaram 
  • Arvindswamy 
  • Salaar 
  • Netflix 
  • Ott 
  • Streaming 
  • Viewership 
  • kalki2898ad 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS