ఇండస్ట్రీని నడిపించేది ఈ సినిమాలే..!

సినిమాల బడ్జెట్ ని బట్టి చిన్నా పెద్ద సినిమాల కాలిక్యులేషన్ చేస్తారన్నది కొందరి లెక్క అయితే.;

Update: 2025-07-17 14:04 GMT

సినిమాల బడ్జెట్ ని బట్టి చిన్నా పెద్ద సినిమాల కాలిక్యులేషన్ చేస్తారన్నది కొందరి లెక్క అయితే. కంటెంట్ ఉన్న సినిమా అది ఎంత తక్కువ బడ్జెట్ సినిమాతో చేసినా అది పెద్ద సినిమానే అనేది సినిమా వాళ్ల లెక్క. ఒక సినిమా జనాలను రీచ్ అయితే అది కొత్త వాళ్లు చేసినా కూడా పెద్దదే అవుతుంది. స్టార్ సినిమాలు, వందల కోట్లు పెట్టిన సినిమాలే పెద్ద సినిమాలు అన్న ఒక సెంటిమెంట్ ఉంది.

ఐతే ఆ సినిమాలు 2, 3 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అందాక ప్రతి వీకెండ్ సినిమాలు ఉండాలంటే చిన్న సినిమాలే రావాలి. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా పరదా సినిమా ఈవెంట్ లో చెప్పారు హీరో సత్యదేవ్. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన పరదా సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్ కి సత్యదేవ్ గెస్ట్ గా వచ్చారు. ఇక తన స్పీచ్ లో భాగంగా చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనుపమ అటు గ్లామర్ గా చేస్తుంది.. ఒక విలేజ్ అమ్మాయిగా చేస్తుందని అన్నారు. పరదా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు. ఇక ఇదే క్రమంలో పెద్ద సినిమాలు రెండు మూడేళ్లకు ఒకసారి వస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీని నడిపిస్తాయని అన్నారు సత్యదేవ్.

ఇలాంటి సినిమాలను ఆదరించడం మన బాధ్యత అని అన్నారు. సత్యదేవ్ చెప్పిన దానిలో కొంతవరకు వాస్తవం ఉంది. చిన్న సినిమాల వల్లే ప్రతి వారాంతరం సినిమాలు రిలీజ్ లు ఉంటున్నాయి. ప్రతి నెల ప్రతి వీకెండ్ ఏదో ఒక సినిమా వస్తుంది. ఐతే వాటిల్లో సక్సెస్ అవుతున్న సినిమాలు ఎన్ని అనేవి చూస్తే షాక్ అవ్వాల్సిందే. చిన్న సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలైతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అలా కాదని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వాటికి నష్టం వస్తుంది.

కనీసం స్టార్ సినిమాల వల్ల వారి అభిమానుల హంగామాతో అయినా కాస్త థియేటర్లు కళకళలాడుతాయి. చిన్న సినిమాలు ఆడాలంటే కమంచి టాక్ తెచ్చుకోవాలి. ఎంతో వ్యయ ప్రయాసలు పడి సినిమా తీసి రిలీజ్ చేస్తున్న దర్శక నిర్మాతలు వాటిని సక్సెస్ చేసుకోవడంలో మాత్రం తడపడుతున్నారు.

Tags:    

Similar News