మరో ఇద్దరికి చూపునిస్తున్న సరోజా దేవి..!

సీనియర్ నటి బి సరోజా దేవి సోమవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. 1955 నుంచి సౌత్ సినీ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు సరోజా దేవి.;

Update: 2025-07-15 13:33 GMT

సీనియర్ నటి బి సరోజా దేవి సోమవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. 1955 నుంచి సౌత్ సినీ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు సరోజా దేవి. తెలుగులో అయితే సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ లతో ఎన్నో సినిమాల్లో నటించారు ఆమె. నటిగా తన వర్సటాలిటీ చూపిస్తూ దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు బి.సరోజా దేవి. అనారొగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె జూలై 14న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

ఐతే తను మృతి చెందినా కూడా మరొకరికి తాను కంటి వెలుగు అవ్వాలని అనుకున్నారు సరోజా దేవి. ఈ క్రమంలో ఆమె తన నేత్ర దానానికి ముందే అంగీకరించారు. తను రెగ్యులర్ గా వెళ్లే నారాయణ నేత్రాలయం కి తాను చనిపోయాక తన కళ్లు తీసుకొని ఇతరులకు పెట్టాలని ఆమె చెప్పారట. ఆమె కోరిక ప్రకారమే సరోజనా దేవి కార్నియా తీసి భద్ర పరిచినట్టు తెలుస్తుంది.

ఈ విషయాన్ని నారాయణ నేత్రాలయ హాస్పిటల్ టీం వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే అవి ఇతరులకు అమర్చుతామని డాక్టర్లు చెబుతున్నారు. సరోజా దేవి మంచి మనసు తెలుసుకున్న సినీ ప్రియులు ఆమె మంచి మనసుకి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. ఒకప్పటి సౌత్ ఆడియన్స్ కు ఇష్టమైన నటి. ఆమె ఎందరో గొప్ప నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 87 ఏళ్ల సరోజా దేవి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి సినిమాలు చేస్తూ వచ్చారు.

కెరీర్ లో 200కి పైగా సినిమాలు చేసిన సరోజా దేవి మరణం సౌత్ సినీ పరిశ్రమకు తీరని లోటు అయ్యింది. ఐతే నేటి యువ ప్రేక్షకులకు ఆమె అంతగా పరిచయం లేదు కానీ 50,60 ల కాలంలో ఆమె ఒక స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో సరోజా దేవి మంచి మంచి సినిమాల్లో నటించారు.

జూలై 13 ఆదివారం ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాస్ రావు కన్నుమూశారు. ఆయన మరణ విషాదం నుంచి పరిశ్రమ కోలుకోక ముందే సరోజా దేవి మృతి పరిశ్రమని శోక సముద్రంలో ముంచి వేసింది. సరోజా దేవి మృతికి తెలుగు సినీ ప్రముఖులు అంతా కూడా తమ నివాళి అర్పించారు.

Tags:    

Similar News