• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సారంగ‌పాణి జాత‌కం.....

సారంగ‌పాణి జాత‌కం.. కాకితో టీజర్ ముచ్చట

| టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రాబోతున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-11-17 08:47 GMT

టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రాబోతున్నాడు. అది కూడా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి దర్శకత్వంలో రూపొందుతూ ఉండడం విశేషం. ఇక శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా రానుంది. వీరి సరికొత్త కాంబినేష‌న్‌లో రాబోతున్న తాజా సినిమాకు ‘సారంగ‌పాణి జాత‌కం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కామెడీ, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. నవంబర్ 21న ఉదయం 11:12 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక టీజర్ విడుదలను మరింత ఆసక్తికరంగా ప్రకటించడానికి హీరో ప్రియదర్శి ఓ ఫన్నీ వీడియోతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.

ప్రియదర్శి ముహూర్తం కోసం వెతుకుతున్న సమయంలో ఒక కాకి ఓ పిలగా.. కొత్త పేరు..కొత్త సినిమా మంచి హుషార‌వుతున్నావు...యాడ జూసిన నీ పాట‌నే...ఎప్పుడు లేంది డ్యాన్స్ మ‌స్తుగా జేశావు" అంటూ పొగడ్తలతో ముచెత్తడం హైలెట్ అయ్యింది. ఇక టీజట్ ఎప్పుడు అని ప్రియదర్శిని ప్రశ్నించగా, అతను "మంచి ముహూర్తం కోసం వెతుకుతున్నా" అని సమాధానం ఇచ్చాడు.

దీనికి తాత, "రాబోయేవ‌న్నీ మంచి రోజులే...ఇగ మ‌న జాత‌కం మారుతోంది" అంటూ నవ్వులు పండించాడు. ఈ చిత్రంలో ప్రియద‌ర్శి సరసన తెలుగు అమ్మాయి రూప కడువయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆధ్యాత్మికత, మూఢనమ్మకాలతో కూడిన ఇతివృత్తానికి ప్రేమకథను జోడించి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇది ఒక మధ్య తరగతి యువకుడి జీవితంలో జరిగే సంఘర్షణలను హాస్యంతో మిళితం చేస్తూ రూపొందించిన చిత్రం. ఈ సినిమాలోని ప్రధాన కథాంశం యువకుడి జీవనశైలిలో చోటు చేసుకునే సంఘర్షణలను దృశ్యరూపంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. అతని జీవితాన్ని గమ్మత్తుగా మార్చే హాస్యసన్నివేశాలు, భావోద్వేగాలను మేకర్స్ ఈ సినిమాను రూపొందించారు. టీజర్ చూస్తే సినిమా మరింత ఆసక్తిని రేకెత్తించనుంది.

సారంగపాణి జాతకం సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా, పీజీ విందా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం, డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన జెంటిల్మన్, సమ్మోహనం తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Full View
Tags:    
  • Sarangapanijathakam 
  • Mohanakrishnaindraganti 
  • Priyadarshi 
  • Roopakoduvayur 
  • Sarangapanijathakamteaser 
  • Sivalenkakrishnaprasad 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS