• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సప్త సాగరాలు దాటి -...

'సప్త సాగరాలు దాటి - సైడ్​ బి'.. టీజర్ ఎలా ఉందంటే

| టీజర్​ను విడుదల చేసి సినిమా రిలీజ్​ డైట్​ను అనౌన్స్​ చేశారు. వాస్తవానికి విజయ దశమికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్​. కానీ అది కుదరలేదు.

By - Tupaki Desk
Update: 2023-10-28 06:04 GMT

రీసెంట్​గా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచిన 'సప్త సాగరాలు దాటి - సైడ్​ ఏ' చిత్రం.. ఈ మధ్యే తెలుగులోనూ విడుదలైంది. కానీ తెలుగులో సినిమా అంతగా క్లిక్ కాలేదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించడంతో పాటు నిర్మించిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర రెండో భాగం 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్​.

టీజర్​ను విడుదల చేసి సినిమా రిలీజ్​ డైట్​ను అనౌన్స్​ చేశారు. వాస్తవానికి విజయ దశమికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్​. కానీ అది కుదరలేదు. దీంతో దీపావళి తర్వాత ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువస్తున్నారు.

ప్రముఖ అగనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. నంవబర్ 17న విడుదల చేయనుంది. 'సైడ్‌ ఎ'లో ప్రేమ కథ చూపిస్తే... 'సైడ్‌ బి'లో ఇంటెన్స్‌ యాక్షన్‌ ఉంటుందని క్లైమాక్స్‌లోని చూపించిన గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చింది.

ఈ ప్రచార చిత్రంలో... తొలి భాగంలో సోల్​ను ఎక్కడా మిస్ చేయకుండా ఓ బ్యూటిఫుల్ కట్​తో చూపించారు మేకర్స్​. ప్రస్తుతం అది ఓటీటీలో అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోందని చెప్పారు. టీజర్ లో రాత్రి పూట రక్షిత్ శెట్టి ఓ బిల్డింగ్​పై పడుకున్న సీన్​తో ప్రారంభమై.. తన ప్రేయసి చెప్పే మాటలు వింటున్నట్టుగా డిజైన్ చేసిన సీక్వెన్స్ హైలెట్ గా నిలిచింది.

అయితే ఈ సింగిల్​ టీజర్​లోనే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో డైలాగ్స్ పెట్టడం ఇంట్రెస్టింగ్​గా ఉంది. చరణ్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ అయ్యింది. ఈ రెండో భాగం కోసం ఇంట్రెస్ట్​గా వెయిట్ చేస్తున్న వారికి.. ఈ టీజర్ మంచి ప్రామిసింగ్ ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తోంది. దర్శకుడు హేమంత్ రావ్ తెరక్కెక్కించిన ఈ అవైటెడ్ సినిమా ఈ నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. మరి సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాలి.

Full View
Tags:    
  • Saptasagaraludhaati 
  • Sideb 
  • Teaser 
  • Peoplemediafactory 
  • Rakshitshetty 
  • Rukmini 
  • Movie 
  • Release 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS