దెబ్బ‌కు దెబ్బ‌..దెబ్బ అదుర్స్ క‌దూ!

తాజాగా కార్తీక్ ఆర్య‌న్ క‌థానాయ‌కుడిగా మృగ‌దీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ -మ‌హావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా `నాగ్లిల్లా` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-09 06:27 GMT

అప్పుడ‌ప్పుడు అవ‌కాశాలు చేజారుతుంటాయి. ఒక‌ర్ని ఆడిష‌న్ చేసి మ‌రొకర్ని తీసుకోవ‌డం జ‌రుగుతుంది. కొన్నిసార్లు సినిమా నుంచి త‌న‌ను తీసేసారు? అన్న సంగ‌తి కూడా తెలియ‌దు. స‌గం షూటింగ్ చేసిన త‌ర్వాత కూడా హీరోయిన్లు మార్చిన సంద‌ర్భాలెన్నో. క‌ర‌ణ్ జోహార్ లాంటి నిర్మాత అయితే త‌న‌కు న‌చ్చ‌క‌పోతే హీరోను కూడా మార్చేస్తాడు. ద‌ర్శ‌కుల‌కు ఆయ‌న చెప్పిందే వేదం కాబ‌ట్టి? డైరెక్ట‌ర్ ఎవ‌రైనా? తుది నిర్ణ‌యం క‌ర‌ణ్ చేతుల్లోనే ఉంటుంది. అలా ఇంత వ‌ర‌కూ క‌ర‌ణ్ చేతుల్లో భంగ‌ప‌డ్డ వారు చాలా మంది ఉన్నారు.

ఆ నిర్మాత‌కు కొత్తేం కాదు:

తాజాగా కార్తీక్ ఆర్య‌న్ క‌థానాయ‌కుడిగా మృగ‌దీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ -మ‌హావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా `నాగ్లిల్లా` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తొలుత హీరోయిన్ స‌న్యా మ‌ల్హోత్రాని ఎంపిక చేసారు. ఆడిష‌న్ చేసి మ‌రీ తీసుకున్నారు. కానీ అనూహ్యంగా కొన్ని రోజుల‌కు సాన్యా మ‌ల్హోత్రాను త‌ప్పించి

ప్ర‌తిభా రంతా ని తీసుకున్నారు. `లాపతా లేడీస్` లో అమ్మ‌డి పుష్ప‌రాణి పెర్పార్మెన్స్ న‌చ్చ‌డంతో క‌ర‌ణ్ జోహార్ ఆదేశాల మేర‌కు మార్చారు. ఇలా ఒక‌ర్ని తీసేసి మ‌రోక‌ర్ని ఎంపిక చేయ‌డం అన్న‌ది క‌ర‌ణ్ కి చిన్న విష‌య‌మే అయినా? ఎంపికైన త‌ర్వాత తీసేయ‌డం అన్న‌ది ఏ న‌టికైనా పెద్ద అవ‌మానం లాంటిందే.

మీ బాస్ కే చెప్పండి అందా:

దీంతో సాన్యా మ‌ల్హోత్రా కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అవ‌కాశం వాళ్ల చేతుల్లో ఉంది కాబ‌ట్టి సాన్యా అప్పుడేం మాట్లాడ లేదు. తాజాగా త‌న‌కీ కూడా టైమ్ ఇచ్చింద‌ని ప్రూవ్ చేసింది. త‌న‌ను తీసేసిన క‌ర‌ణో జోహార్ కంపెనీ నుంచి తాజాగా మ‌రో ఫోన్ కాల్ వెళ్లిందిట‌. మ‌రో సినిమాలో తీసుకుంటామ‌ని ఆడీష‌న్ కు రావాల్సిందిగా కాల్ వెళ్లిందిట‌. దీంతో సాన్యా మ‌ల్హోత్రా మీ అవ‌కాశం నాకు అవ‌సరం లేదంటూ తిప్పి కొట్టిందిట‌. ఈ విష‌యం వెళ్లి మీ బాస్ కి చెప్పండ‌ని కాస్త‌ గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చిందిట‌. ప్ర‌స్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సౌత్ లో ఎంట్రీ అలా:

నిర్మాత‌కు త‌గిన రీతిలోనే స‌మాధానం ఇచ్చిందంటూ నెట్టింట పోస్టులు ప‌డుతున్నాయి. సాన్యా మ‌ల్హోత్రా ఈ ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం `టోస్ట‌ర్` లో న‌టిస్తుంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. `థ‌గ్ లైఫ్` తో సౌత్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అమ్మ‌డు జింగుచ్చా అనే స్పెష‌ల్ సాంగ్ లో న‌టించింది. న‌టిగా మాత్రం ఇంకా ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌లేదు. త‌మిళ్ స‌హా తెలుగులో మంచి అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News