సంక్రాంతి స్పెషల్.. ఆకట్టుకుంటున్న మూవీ పోస్టర్స్!
మరొకవైపు త్వరలో రాబోతున్న సినిమాలకు సంబంధించి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి మరి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పోస్టర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.;
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతుంటే.. మరొకవైపు త్వరలో రాబోతున్న సినిమాలకు సంబంధించి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి మరి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పోస్టర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సందడి జనవరి 9 నుంచే మొదలయ్యింది. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో మొదలైన ఈ హవా.. ఆ తర్వాత జనవరి 12న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలైంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 152 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇక జనవరి 14వ తేదీన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా విడుదలయ్యింది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా మొదటిరోజు 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇక అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ , టైటిల్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ పంచుకుంది.
అలాగే అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ పంచుకుంది.
అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన 54వ సినిమా పేరు కర అని తెలుపుతూ ఒక పవర్ఫుల్ పోస్టర్ ను పంచుకున్నారు.
అలాగే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. అందులో భాగంగానే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన ఏక్ దిన్ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు దర్శకులు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ చిత్రం నుంచి ఒక కొత్త పోస్టర్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ మూవీ నుండి మరో ఆసక్తికర పోస్టర్ ను పంచుకున్నారు చిత్ర బృందం. ఇందులో హీరో విశ్వక్ సేన్ హీరోయిన్ కి ఏదో చూపిస్తున్నట్టు ఉన్న లుక్ కి సంబంధించిన ఫోటో ని షేర్ చేశారు.
నాగబంధం సినిమాలో నభా నటేష్ పార్వతీ పాత్ర పోషిస్తున్నట్లు ఆమె క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ పంచుకున్నారు చిత్ర బృందం.
నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమా నుండి మేకర్స్ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ పంచుకున్నారు. ఇందులో నిఖిల్ ఒక టెంపుల్ ముందు డివోషనల్ మోడ్ లో డాన్స్ చేస్తున్నట్లు ఆ పోస్టర్ ను పంచుకున్నారు.
సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ను పంచుకున్నారు. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు ఈ సంక్రాంతికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు పంచుకున్నారు.