సంక్రాంతికి పాంచ్ పటాకా.. ఆ టార్గెట్ తోనే సినిమాలన్నీ..!

పొంగల్ రేసులో సినిమాల ఫైట్ కామన్ అయ్యింది. స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా ఈ పోటీలో రావడం ఫిక్స్ అయ్యింది.;

Update: 2025-10-30 03:57 GMT

పొంగల్ రేసులో సినిమాల ఫైట్ కామన్ అయ్యింది. స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా ఈ పోటీలో రావడం ఫిక్స్ అయ్యింది. 2026 పొంగల్ కి స్టార్ సినిమాలతో పాటుగా యువ హీరోల సినిమాలు కూడా ఆడియన్స్ ని మెప్పించేందుకు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ గా వస్తుండటంతో ఈ ఫైట్ మరింత క్రేజీగా మారింది.

మెగాస్టార్ మన శంకర వరప్రసాద్..

పొంగల్ రేసులో మొదట ఖర్చీఫ్ వేసిన సినిమా మెగాస్టార్ మన శంకర వరప్రసాద్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి సినిమా వస్తే అది పక్కా హిట్ అన్నట్టే లెక్క. అలా సంక్రాంతి హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ తో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి.

మన శంకర వర ప్రసాద్ కూడా అనిల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తూనే మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా భీమ్స్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. మెగా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ వస్తుంది.

రెబల్ స్టార్ రాజా సాబ్ సినిమాతో..

ఇక ఈ సినిమాతో పాటు రేసులో ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ సంక్రాంతికి వస్తున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది.

రాజా సాబ్ సినిమా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ ఫైనల్ గా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేసుకుంది. ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

మాస్ మహరాజ్ రవితేజ.. కిషోర్ తిరుమల డైరెక్షన్..

సంక్రాంతి పోటీలో తాను కూడా ఉంటానంటూ వస్తున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో సంక్రాంతి ఫైట్ కి సిద్ధమవుతున్నాడు రవితేజ. అనార్కలి టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, కెతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కిషోర్ తిరుమల సినిమాలన్నీ కూల్ గా ఎంటర్టైన్ చేస్తాయి. ఆఫ్టర్ గ్యాప్ ఆయన చేస్తున్న ఈ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ కి ఎనర్జిటిక్ హిట్ అందిస్తుందని అంటున్నారు.

జాతిరత్నం నవీన్ పొలిశెట్టి..

పొంగల్ రేసులో జాతిరత్నం నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సినిమా ప్రమోషన్స్ తోనే బజ్ పెంచేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.

సంక్రాంతి రేసులో శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా వస్తుంది. రాం అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో సంక్రాంతికి తన మార్క్ ఎంటర్టైనర్ తో రావాలని ఫిక్స్ అయ్యాడు శర్వానంద్.

మొత్తానికి ఈ ఐదు సినిమాలతో పొంగల్ రేసులో ఆడియన్స్ కు పాంచ్ పటాకా ఎంటర్టైన్మెంట్ అందించాలని చూస్తున్నారు. ఈ సినిమాల్లో దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. ఐతే వీటిలో మెయిన్ గా అందరు ఆడియన్స్ ని ఎంటర్టైన్ తోనే మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా సినిమాలన్నీ ఏమో కానీ ప్రభాస్ రాజా సాబ్ భయపెడుతూ ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు.

Tags:    

Similar News