• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి ఫైట్.. దిల్...

సంక్రాంతి ఫైట్.. దిల్ రాజు ధైర్యమేంటి?

| సంక్రాంతి అనగానే ఒక నాలుగు సినిమాలు పోటీలో ఉండడం చాలా కామన్. కానీ 2024వ సంక్రాంతి సీజన్ మాత్రం టాలీవుడ్ లో నెవ్వర్ బిఫోర్ అనే సీన్ కనిపించబోతోంది.

By - Tupaki Desk
Update: 2023-11-20 06:47 GMT

సంక్రాంతి అనగానే ఒక నాలుగు సినిమాలు పోటీలో ఉండడం చాలా కామన్. కానీ 2024వ సంక్రాంతి సీజన్ మాత్రం టాలీవుడ్ లో నెవ్వర్ బిఫోర్ అనే సీన్ కనిపించబోతోంది. ఎందుకంటే ఒకేసారి ఆరు సినిమాలు పోటీలో దిగుతున్నాయి. అలాగే రెండు తమిళ సినిమాలు కూడా ఈ పోటీలో వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కాబట్టి ఈసారి పొంగల్ ఫైట్ అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది.

ఎవరికి వారు కంటెంట్ మీద నమ్మకంతో ఈ పోటీల్లో దిగుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఒక విధంగా దిల్ రాజు ఇంత పోటీ ఉన్నప్పటికీ ఎందుకు ఫ్యామిలీ స్టార్ ను సంక్రాంతికి తీసుకొస్తున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ఎనౌన్స్ చేసిన సినిమాల లిస్టులో కాస్త లేటుగా అనౌన్స్ చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్.

దిల్ రాజుకు థియేటర్లో విషయంలో పెద్దగా డోకా ఉండదు. కాకపోతే ఆయన మిగతా సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా పెట్టుబడును పెడుతున్నారు. ఇక ఫ్యామిలీ స్టోర్ మీద ఉన్న నమ్మకం చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఎన్ని సమస్యలు వస్తున్న పనులను మాత్రం అసలు ఆపడం లేదు. నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కారణంగా పుష్ప 2 లాంటి సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చారు. కానీ దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదు. దీన్ని బట్టి సంక్రాంతిని ఎంతగా టార్గెట్ చేస్తున్నారో చెప్పనక్కరలేదు.

అయితే ప్రధానంగా దిల్ రాజు ధైర్యం మాత్రం ఈ సినిమాకు సరైన కాంబినేషన్ సెట్ కావడం. ఇదివరకే గీతగోవిందం సినిమాతో మంచి సక్సెస్ చూసిన విజయ్ దేవరకొండ పరుశురామ్ వారి స్థాయిని పెంచుకున్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి అనగానే ఫ్యామిలీ కథలకు హై డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ స్టార్ మినిమం అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉంటుంది.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా కలెక్షన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. దర్శకుడు పరిశురామ్ ఫ్యామిలీ కథలను బాగా హ్యాండిల్ చేయగలరు. అంతే కాకుండా అతని కామెడీ టైమింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద మిగతా సినిమాలకు పోటీ ఇవ్వడం పక్కా అని చెప్పవచ్చు.

అయితే సంక్రాంతి పోటీలో చాలా బలంగా నమ్మకం వస్తున్న వారిలో గుంటూరు కారం కూడా ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అందులోనూ కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమా రాబోతుంది. ఇక నాగర్జున కూడా సంక్రాంతి సెంటిమెంట్ లో నా సామిరంగా సినిమాను అంతే నమ్మకంతో రంగంలోకి దింపుతున్నాడు. ఇక సైంధవ్ హనుమాన్ కూడా కంటెంట్ తో మెప్పించగలిగితే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాల వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ మొదట్లోనే ఇంట్రెస్ట్ చూపించే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి దిల్ రాజు పక్క ప్రణాళికతోనే ఫ్యామిలీ స్టార్ టైటిల్ తోనే ఆడియోన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. మరి దిల్ రాజు నమ్మిన కంటెంట్ ఏమతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    
  • Gunturukaaram 
  • Famillystar 
  • Sankaranthi 
  • Saindhav 
  • Vijaydevarakonda 
  • maheshbabu 
  • Trivikram 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS