మరో నటుడి భార్యని వేధించిన యువకుడు!
తాజాగా ఇదే పరిశ్రమకు చెందిన కమెడియన్ సంజు బసయ్య భార్య పల్లవిని ఓ దుండగుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా అసభ్య మేసెజ్ లతో ఇబ్బంది పెట్టాడు.;
శాండిల్ వుడ్ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ అభిమాని మర్డర్ కేస్ ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. పవిత్రా గౌడ్ ని అభిమాని మెసేజ్ లతో వేధించిన కారణంగా ప్రియురాలు మీద ప్రేమతో కోపంతో అభిమానిపై దాడి చేయడం...చనిపోవడం...జైలుకెళ్లడం తెలిసిందే. ప్రస్తుతం దర్శన్, పవిత్రా గౌడ్ బెయిల్ పై బయట ఉన్నారు. క్షణికావేశంలో పాల్పడిన దాడి కారణంగా కొన్ని నెలలు పాటు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. కేసును నేటికి ఎదుర్కుంటున్నారు.
తాజాగా ఇదే పరిశ్రమకు చెందిన కమెడియన్ సంజు బసయ్య భార్య పల్లవిని ఓ దుండగుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా అసభ్య మేసెజ్ లతో ఇబ్బంది పెట్టాడు. ఈ విషయాన్ని సంజు బసయ్యకు భార్య చెప్పగానే ఆయన తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి ఆవేశానికి గురికాకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా పోలీసుల ముందే అతడిని పిలిపించి కౌన్సిలింగ్, వార్నింగ్ ఇప్పించాడు. ఆ దుండగుడు విద్యార్ది కావడంతో అతడి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సంజు బసయ్య పోలీస్ లను కేసు నమోదు చేయోద్దని సూచించాడు.
కేసు పేరుతో అతడిని ఇబ్బంది పెట్టి తాను సంతోషంగా ఉండలేనని..మనుషులంతా ఒక్కటే అన్న సమ భావన కలిగిన వాడిగా ఆ తప్పు తాను చేయలేన్నాడు. కేసు పెడితే అతడి విద్యార్ది జీవితం సహా చాలా కోల్పోవల్సి వస్తుందని ఆలోచించి వదిలేసినట్లు తెలిపారు. ఈ ఘటన బెళగావి పోలీస్ స్టేషన్ ఫరదిలో చోటు చేసుకుంది. దీంతో సంజు బసయ్యపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆ విద్యార్ది చేసిన పని తప్పైనా అతడి వయసు, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కోపానికి గురి కాకుండా వ్యవహరించారని అందుకు ఎంతో గొప్ప హృదయం ఉండాలని పోస్టులు పెడుతున్నారు. ఆ యువకుడు సంజు బసయ్య కుటుంబానికి క్షమాణలు చెప్పాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవరించాలని పోలీసులు సూచించారు.