• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంజయ్‌ మాటలతో ఇస్మార్ట్‌...

సంజయ్‌ మాటలతో ఇస్మార్ట్‌ డబుల్‌ జోరు..!

| ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆయన సినిమా ప్రమోషన్‌ లో పాల్గొనలేక పోతున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-08-14 12:30 GMT

మరికొన్ని గంటల్లో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా, పూరి తన మార్క్‌ మాస్ ఎంటర్‌ టైనర్ గా, విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందించిన ఈ సినిమా కి విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్‌ అయ్యి అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువగానే బిజినెస్ అయ్యిందట. రామ్ తో పూరి గతంలో తీసిన ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్ నేపథ్యంలో డబుల్‌ ఇస్మార్ట్‌ అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు, అదే విధంగా ఉంటుందని మేకర్స్ కూడా నమ్మకంగా చెబుతున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆయన సినిమా ప్రమోషన్‌ లో పాల్గొనలేక పోతున్నాడు. ముందుగా కమిట్ అయిన ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం సంజయ్‌ దత్‌ డేట్లు ఇవ్వాల్సి వచ్చిందట. అందుకే ప్రీ రిలీజ్ వేడుకతో పాటు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల్లో సంజయ్‌ దత్ పాల్గొనడం లేదు. గతంలోనే షూట్‌ చేసిన ఒక ఇంటర్వ్యూను తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు రిలీజ్ చేశారు. అందులో రామ్‌, పూరి, ఛార్మీ, కావ్య థాపర్‌ లతో పాటు సంజయ్ దత్ కూడా ఉన్నాడు.

ఆ ఇంటర్వయూలో సంజయ్ దత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్లైమాక్స్ లో తాను చాలా ఎగ్జైట్‌ అయ్యాను అంటూ సంజయ్ దత్‌ చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ లో శివ లింగం ప్రతిష్టించి చేసిన షూటింగ్‌ కు నోట మాట రాలేదు. ఆ సమయంలో నాకు అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఆ లింగం ముందు సన్నివేశాల చిత్రీకరణ నాకు గూస్‌ బంప్స్ ను తెప్పించాయి. శివ లింగం ప్రతిష్టించి చేసిన సన్నివేశం చిత్రీకరణ నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ శివ లింగంకు సంబంధించిన షాట్స్ ను ట్రైలర్‌ లో చూపించడం జరిగింది. ట్రైలర్‌ లో చూసినప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇప్పుడు సంజయ్ దత్‌ ఆ సన్నివేశాల గురించి మాట్లాడుతూ తనకు గూస్ బంప్స్ అంటూ చెప్పడంతో ఇస్మార్ట్‌ జోరు రెట్టింపు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్‌ ఆడియన్స్ ను ఉర్రూతలూగించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇస్మార్ట్‌ శంకర్ సూపర్ హిట్‌ అవ్వడం, ఆ ప్రాంచైజీ మూవీ అవ్వడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా ఉంటుందని ప్రమోషనల్‌ స్టఫ్ ను చూస్తే అర్థం అవుతుంది. రామ్‌ తో పాటు పూరికి ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. మరి వారికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • DoubleiSmart 
  • Ram 
  • Kavyathapar 
  • SanjayDutt 
  • PuriJagannadh 
  • CharmeeKaur 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS