• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వంగా బాలీవుడ్ ట్రెండ్.....

వంగా బాలీవుడ్ ట్రెండ్.. వాళ్ళు లాగేస్తున్నారు

| ఇక ఈ రేంజ్ లో సందీప్ విజయాలను అందిస్తూ ఉంటే బాలీవుడ్ హీరోలు మాత్రం ఎందుకు వదులుకుంటారు.

By - Tupaki Desk
Update: 2023-12-05 15:30 GMT

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో గట్టిగానే మారుమ్రోగిపోతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ తో అతను చేసిన యానిమాల్ ప్రయోగం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను గట్టిగానే షేక్ చేస్తోంది. విడుదలకు ముందే ఊహించని స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసిన సందీప్ ఇప్పుడు అంతకుమించి అనేలా క్రేజ్ అయితే అందుకుంటూ ఉన్నాడు.

ఇక అతని క్రేజ్ చూస్తూ ఉంటే బాలీవుడ్ హీరోలు భవిష్యత్తులో గట్టిగానే అతనితో సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రణబీర్ కపూర్ అయితే కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ సందీప్ తో వర్క్ చేయాలి అని ఆలోచనతోనే ఉన్నాడు. మొదట అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు అతని తెలుగు ఇండస్ట్రీలో మరో సినిమా చేయాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేశాడు.

కానీ మన కమర్షియల్ స్టార్ హీరోలు అతనితో రిస్క్ చేయలేక వెనుకడుగు వేశారు. దీంతో సందీప్ అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్లో రీమేక్ చేసి సక్సెస్ కొట్టేసాడు. కబీర్ సింగ్ గా వచ్చిన ఆ సినిమా హీరో షాహిద్ కపూర్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రణబీర్ కపూర్ కెరీర్ లో కూడా యానిమల్ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచే అవకాశం ఉంది.

ఇక ఈ రేంజ్ లో సందీప్ విజయాలను అందిస్తూ ఉంటే బాలీవుడ్ హీరోలు మాత్రం ఎందుకు వదులుకుంటారు. అలాగే టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్స్ ఇచ్చి బాలీవుడ్ హీరోలతోనే సినిమాలను చేయించే దిశగా అడుగులు వేస్తున్నాయి. చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో సందీప్ ను బాలీవుడ్ వాళ్ళు గట్టిగానే లాగేసుకునే అవకాశం కనిపిస్తోంది.

గతంలో రాంగోపాల్ వర్మకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఒక విధంగా వర్మకు బాలీవుడ్లో సినిమాలు చేయాలనే ఇంటెన్షన్ మొదటి నుంచి ఉంది కాబట్టి తెలుగు నిర్మాతలు హీరోలు మాత్రం అతన్ని ఎంత టెంప్ట్ చేసినా కూడా టాలీవుడ్ లో ఉండలేకపోయాడు. అయితే ఇప్పుడు సందీప్ తో వర్క్ చేయడానికి అల్లు అర్జున్ ప్రభాస్ లాంటి టాలీవుడ్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ప్రభాస్ స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. అయితే ఆ తర్వాత బన్నీతో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. అలాగే మహేష్ కూడా లైన్ లో ఉన్నాడు. కానీ ఇంతలోపు బాలీవుడ్ హీరోలు కూడా సందీప్ ను ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా సందీప్ ను లాక్ చేస్తే టాలీవుడ్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి మనవాళ్లు సందీప్ ను వదులుకుంటారా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.

Tags:    
  • Tollywood 
  • Director 
  • Sandeepreddyvanga 
  • Bollywood 
  • Animal 
  • Animalmovie 
  • Producers 
  • Spirit 
  • Prabhas 
  • Alluarjun 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS