సందీప్ రెడ్డి వంగాను భయపెట్టిన ఇంటర్వెల్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే ఎన్నో సంచలనాలు సృష్టించారు సందీప్;
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే ఎన్నో సంచలనాలు సృష్టించారు సందీప్. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు. కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ చేసి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాను చాటుకున్నారు సందీప్.
సందీప్ సినిమాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో ఆయన కూడా అంతే బోల్డ్ గా ఉంటారు. మనసులో అనిపించింది ఎలాంటి మొహమాటాలు లేకుండా బయటకు చెప్తూ ఉండే ఆయన రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో కు హాజరయ్యారు. సందీప్ తో పాటూ ఆ ఎపిసోడ్ లో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా పాల్గొన్నారు.
సత్య సినిమా 50 సార్లు చూశా..
ఆ టాక్ లో సందీప్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ తనకు తెలియకుండానే గురువైపోయారని, ఆయన్నుంచి, ఆయన సినిమాల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, సత్య సినిమా సుమారు 50-60 సార్లు చూసి ఉంటానని, ఆ సినిమా చూసే తాను ఎడిటింగ్ నేర్చుకున్నట్టు చెప్పిన సందీప్, బాహుబలి2 ఇంటర్వెల్ చూశాక అర్జున్ రెడ్డి విషయంలో భయపడ్డానని అన్నారు.
బాహుబలి2 ఇంటర్వెల్ చూశాక భయపడ్డా
సినిమాకు ఇంటర్వెల్ కూడా చాలా గొప్పగా ఉండాలని రాజమౌళి ప్రూవ్ చేశారని, తాను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో బెస్ట్ బాహుబలి2 కు మించిన ఇంటర్వెల్ సీన్ లేదని, ఆ సినిమా చూసొచ్చాక అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా అని భయమేసిందని, కానీ ట్రైలర్ రిలీజయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి ధైర్యమొచ్చినట్టు సందీప్ తెలిపారు.
స్పిరిట్ కు 70% బీజీఎం పూర్తైంది
ఏ సినిమాకైనా ముందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెడీ చేసుకుంటే చాలా టైమ్ సేవ్ అవుతుందని, ఈ విషయం తనకు అర్జున్ రెడ్డి టైమ్ లో తెలియలేదని, యానిమల్ సినిమా షూటింగ్ కంటే ముందే 80% మ్యూజిక్ వర్క్ ఫినిష్ చేశామని, ఇప్పుడు ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ సినిమాకు కూడా అదే చేస్తున్నానని, ఆల్రెడీ స్పిరిట్ మూవీకి 70% బీజీఎం రెడీ అయిపోయిందని చెప్పారు. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని, ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో వర్క్ చేయడమెలా ఉంటుందోనని మొదట్లో అనుకున్నా కానీ ఆయనతో ట్రావెల్ అయ్యాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని అర్థమైందని, త్వరలోనే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని, షూటింగ్ మొదలయ్యాక సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలను షేర్ చేసుకుంటానని సందీప్ చెప్పారు.