ఆర్జీవి కాదు ఆర్జీవి కా బాప్..!
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై తన మార్క్ వేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.;
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై తన మార్క్ వేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమా ఛాన్స్ కోసం చాలా ఆఫీస్ ల చుట్టూ తిరిగి ఫైనల్ గా తనే సొంత నిర్మాణం చేసుకుని సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత సందీప్ సత్తా ఏంటన్నది అర్ధమైంది. వెంటనే బాలీవుడ్ వెళ్లి కబీర్ సింగ్ అంటూ ఆ సినిమానే రీమేక్ చేశారు. ఇక యానిమల్ అంటూ రణ్ బీర్ కపూర్ తో నెక్స్ట్ లెవెల్ సినిమా చేశాడు సందీప్ వంగ.
ఆర్జీవి అంటే ఒక సెపరేట్ క్రేజ్..
యానిమల్ చూసిన కొందరు సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా అవేవి కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించలేదు. అంతేకాదు అప్పుడు అతనిపై కామెంట్స్ చేసిన చాలామంది సందీప్ వంగ క్రియేషన్ కి సలాం కొట్టారు. ఐతే తెలుగు పరిశ్రమ కాదు కాదు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఆర్జీవి అంటే ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఆయన తన ప్రతి సినిమాతో కొత్తగా ఫ్రేంస్ పెడుతూ.. కొత్త స్టోరీ టెల్లింగ్ తో వచ్చారు.
అలాంటి ఆర్జీవితో సందీప్ వంగని పోల్చాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఒక మీటింగ్ లో ఆర్జీవీని కలిసిన రాజమౌళి సందీప్ వంగాని ఆర్జీవితో పోల్చాడట. ఐతే మళ్లీ అదే రాజమౌళి యానిమల్ చూశాక సందీప్ వంగ ఆర్జీవి కాదు ఆర్జీవి కా బాప్ అని అన్నాడట. ఈ విషయాన్ని ఆర్జీవి శివ 4కె రిలీజ్ ప్రమోషన్స్ లో సందీప్ వంగ చేసిన ఇంటర్వ్యూలో ఆర్జీవి చెప్పాడు.
సినిమా ఫార్మెట్ ని మార్చే డైరెక్టర్స్..
రాజమౌళి, ఆర్జీవి చెప్పారని కాదు కానీ సినిమా ట్రెండ్ మార్చే డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉంటారు. అందరి దారిలో వెళ్తూ కొత్త రికార్డులు సృష్టించే దర్శకులు కొందరైతే సినిమా ఫార్మెట్ ని మార్చే డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో అప్పుడు ఆర్జీవి ఎలా అయితే సినిమా సినిమాకు సినీ లవర్స్ ని తన మ్యాడ్ నెస్ తో పిచ్చెక్కించేశాడో ఇప్పుడు సందీప్ వంగ ఒక దాన్ని మించి మరో సినిమా మెంటల్ ఎక్కించేస్తున్నాడు.
సందీప్ వంగ నెక్స్ట్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ప్రభాస్ అసలు సిసలైన రెబలిజం చూపిస్తాడని రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సందీప్ వంగ స్పిరిట్ ని కూడా తన మార్క్ టేకింగ్ తో మరో రికార్డ్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా ఫిక్స్ అవగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఆర్జీవి కూడా సందీప్ వర్క్ కి ఫిదా..
ఆర్జీవి కూడా సందీప్ వంగ వర్క్ కి ఫిదా అయిపోతున్నాడు. ఈమధ్య ఎక్కువ ఆర్జీవీతో ఇంటరాక్షన్ లో ఉంటున్న సందీప్ వంగ ఆయన మరోసారి శివ టైం ని గుర్తు చేసుకుని సినిమా చేస్తే మా లాంటి వాళ్లంతా సైడ్ అవ్వాల్సిందే అని చెప్పాడు. ఆర్జీవి టేకింగ్ తో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ మెంట్ లేకపోయినా తన సినిమాల మీద ఆర్జీవీ ఇంపాక్ట్ ఏదో ఒక విధంగా ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాడు సందీప్ వంగ.