'మోగ్లీ మూవీ.. నేనే దురదృష్టవంతుడిని'.. కలర్ ఫోటో డైరెక్టర్ ఎమోషనల్

కలర్ ఫోటో డైరెక్టర్ .. అదేనండీ దర్శకుడు సందీప్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే ఆయన నేషనల్ అవార్డు గెలుచుకున్నారు.;

Update: 2025-12-09 11:42 GMT

కలర్ ఫోటో డైరెక్టర్ .. అదేనండీ దర్శకుడు సందీప్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే ఆయన నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసిన సందీప్ రాజ్.. ఆ తర్వాత కలర్ ఫోటోను రూపిందించారు. ఆ సినిమా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

కరోనా లాక్ డౌన్ కావడంతో ఓటీటీకే పరిమితమైన ఆ మూవీతో సందీప్ రాజ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత గుడ్ లక్ సఖి, ముఖచిత్రం వంటి చిత్రాలకు రైటర్ గా వర్క్ చేశారు. సీతారామంతోపాటు వివిధ సినిమాల్లో నటుడిగా కనిపించారు. ఇప్పుడు మోగ్లీ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత దర్శకుడిగా రెండో సినిమా చేస్తున్నారు సందీప్ రాజ్. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ చేపట్టి మూవీపై ఆసక్తి రేపారు.

కానీ ఇప్పుడు మోగ్లీ రిలీజ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 12న అఖండ 2: తాండవం సినిమా రానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మోగ్లీని వాయిదా వేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ సందీప్ రాజ్ తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు బహుశా నా బదులుగా మరొక దర్శకుడు తీసుంటే బాగుణ్ణు అని ఇప్పుడు అనిపిస్తుంది. రెండు సినిమాలు తమ వృత్తి కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులైన వ్యక్తులచే రూపొందాయి. రెండు చిత్రాల మధ్య కామెన్ పాయింట్స్ ఇవే" అంటూ సందీప్ రాజ్.. సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

"1. ప్రతిదీ బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, వాటి రిలీజ్ ల విషయంలో ఊహించని ఆటంకాలు ఎదురయ్యాయి. 2. రెండోది నేను.. అయితే నేనే దురదృష్టవంతుడినేమో. నేను కూడా అదే బ్యాడ్‌ లక్ అనే ఫీల్ అవ్వడం ప్రారంభించాను. దర్శకత్వం: సందీప్ రాజ్ అనే టైటిల్‌ ను వెండి తెరపై చూడాలనే నా కల రోజురోజుకూ కష్టం అవుతోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

"బహుశా సిల్వర్‌ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని అనుకుంటున్నాను. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, మారుతి, భైరవ సహా మరెందరో డెడికేషన్ ఉన్న వ్యక్తుల హార్డ్ వర్క్ తో మోగ్లీ మూవీని నిర్మించారు. కనీసం వారి కోసమైనా మోగ్లీ మూవీకి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను" అంటూ సందీప్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో.. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

Tags:    

Similar News