ప్రముఖ ప్రొడ్యూసర్ మృతి.. థియేటర్ ఆర్టిస్టు నుండి నిర్మాతగా.. ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం!

అలాంటి ఈయన గుండెపోటుతో మరణించారని తెలిసి ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ కన్నడ చలనచిత్ర నిర్మాత దిలీప్ రాజ్

Update: 2026-05-13 05:27 GMT

టాలీవుడ్, హాలీవుడ్, శాండిల్ వుడ్, హాలీవుడ్ అంటూ తేడా లేకుండా ఈమధ్య సెలబ్రిటీలు పలు కారణాల వల్ల స్వర్గస్తులవుతూ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా తమ అద్భుతమైన నటనతో దర్శకత్వ మెలుకువలతో ఎంతోమందిని మెప్పించిన సెలబ్రిటీలు.. ఇలా ఉన్నట్టుండి లోకాన్ని విడిచి వెళ్లడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు గొప్ప నటీనటులను కోల్పోవడంతో ఇండస్ట్రీ కూడా ఒంటరి అవుతోంది. ఇకపోతే గత వారం రోజులుగా కొంతమంది సెలబ్రిటీలు రోడ్డు ప్రమాదంలో మరణించి సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టివేస్తే.. ఇప్పుడు మరో విషాదం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది..

నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న ఒక నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా, థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా సంచలనం సృష్టించారు. అలాంటి ఈయన గుండెపోటుతో మరణించారని తెలిసి ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ కన్నడ చలనచిత్ర నిర్మాత దిలీప్ రాజ్. మే 13 బుధవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

దిలీప్ రాజ్ మరణానికి సినీ ప్రముఖులు, బుల్లితెర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయగా.. అటు అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. దిలీప్ రాజ్ కెరియర్ విషయానికి వస్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. తన కెరియర్లో పునీత్ రాజ్ కుమార్ నటించిన మిలానా అనే చిత్రంతో నిర్మాతగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత U -టర్న్ సినిమాతో పాటు బుల్లితెరపై హిట్లర్ కళ్యాణ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

దిలీప్ రాజు నిర్మాతగా, నటుడుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు అందుకున్నారు. ఆ దినగలు చిత్రంలో నటుడు చేతన్ కుమార్ కి స్వయంగా డబ్బింగ్ చెప్పారు. థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిలీప్ రాజ్ సినీ ప్రస్థానం విషయానికి వస్తే.. నటరంగ , దృష్టి వంటి నాటక బృందాలతో కలిసి పని చేసిన ఈయన.. నటి నందిత ప్రోత్సాహంతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.

ఇక అక్కడ రంగోలి, రథసప్తమి, మాంగళ్య వంటి సీరియల్స్ లో పనిచేసి బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైన దిలీప్ రాజ్..ఆ తర్వాత డీఆర్ క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ ను స్థాపించి.. చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పట్టుదల ,శ్రమ , కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చు అని దిలీప్ రాజ్ నిరూపించారు. అలా థియేటర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను ప్రారంభించి నేడు నిర్మాతగా మారి తన ప్రయాణంతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఆయన అకాల మరణం పట్ల కన్నడ నటీనటులు , అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News