కెమెరా నుంచి ఫ్లాష్‌లు కాదు బుల్లెట్లు కురుస్తున్నాయ్
సంయుక్త తన ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ ``స్మైల్ ఫర్ మీ... రొమాంటిసైజింగ్`` అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి కెమెరా ఈమోజీలను కూడా జోడించారు.;
సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను చూస్తుంటే నిజంగానే కెమెరా ఫ్లాష్‌ల నుంచి కాంతి కాదు.. కుర్రకారు గుండెల్లోకి బుల్లెట్లు దూసుకువెళ్తున్నట్లున్నాయని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక అందమైన డిజైనర్ గౌన్‌లో సంయుక్త ఇస్తున్న ఫోజులు.. తన హావభావాలు చూస్తుంటే ఫ్యాషన్ అనే పదానికి ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పక తప్పదు. సంయుక్త స్టైల్, గ్లామర్.. ఆ వయ్యారాల వడ్డనలు చూసి ఫ్యాన్స్ మతిపోగొట్టుకుంటున్నారు.
సంయుక్త తన ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ ``స్మైల్ ఫర్ మీ... రొమాంటిసైజింగ్`` అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి కెమెరా ఈమోజీలను కూడా జోడించారు. ఈ ఫోటోషూట్‌లో సంయుక్త తనదైన శైలిలో ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా గ్లామరస్ పాత్రల్లోనే కాకుండా.. ఇలాంటి ఫోటోషూట్లతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కెమెరా ముందు సంయుక్త ప్రతి హావభావం అభిమానులకు ఒక విజువల్ ట్రీట్.
మరోవైపు కెరీర్ పరంగా సంయుక్త బిజీగా ఉంది. సంయుక్త మీనన్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తన తదుపరి ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ డ్రామా `స్వయంభు`లో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం సంయుక్త ప్రత్యేకంగా యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీ నేర్చుకోవడం విశేషం. ఇందులో ఆమె ఒక ధైర్యవంతురాలైన యువరాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంయుక్త కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది.
అలాగే `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో సంయుక్త ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్ ప్రధాన హీరోయిన్ అయినా కానీ కథను మలుపు తిప్పే ఒక ప్రాధాన్యత కలిగిన పాత్రలో సంయుక్తను ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న బెంజ్ అనే తమిళ చిత్రంలోను సంయుక్తకు అవకాశం దక్కిందని కథనాలొస్తున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ చిత్రంలోను సంయుక్త నటిస్తోంది.
గుసగుస....
సంయుక్తపై ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తదుపరి భారీ `వారియర్` చిత్రంలో సంయుక్తను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కాబట్టి ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు నిజంగానే సంయుక్త త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుందా? లేదా అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా సంయుక్త తన నటనతో, గ్లామర్‌తో టాలీవుడ్‌లో హృదయాలను గెలుచుకుంది. ఈ బ్యూటీ ఖాతాలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ చూస్తుంటే మునుముందు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.