గ్లామర్ ప్రపంచంలో రాణిస్తున్న టాప్ -10 తెలుగమ్మాయిలు
గ్లామర్ రోల్స్ తో పాటు యాక్షన్ ప్యాక్డ్ పాత్రలతోనూ ఆకట్టుకుంటున్న డింపుల్ హయతి, `ఖిలాడి`, `సామాన్యుడు`వంటి చిత్రాలలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
గ్లామర్ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస చిత్రాలతో దూసుకుపోతున్న టాప్ తెలుగమ్మాయిలు తమ అద్భుతమైన ప్రతిభతో మైమరిపిస్తున్నారు. `బేబీ` చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని ఒక్కసారిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన వైష్ణవి చైతన్య.. తన సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఆనంద్ దేవరకొండ సరసన నటించిన `ఎపిక్` చిత్రంతో మరోసారి నటిగా మంచి మార్కులే వేయించుకుంది. అలాగే `జాతిరత్నాలు` చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఫరియా అబ్దుల్లా తన హైట్.. ఎనర్జిటిక్ డ్యాన్సులు.. కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా `గాయపడ్డ సింహం` వంటి చిత్రాలతో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
గ్లామర్ రోల్స్ తో పాటు యాక్షన్ ప్యాక్డ్ పాత్రలతోనూ ఆకట్టుకుంటున్న డింపుల్ హయతి, `ఖిలాడి`, `సామాన్యుడు`వంటి చిత్రాలలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇటీవల కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రంతో తన నటనలో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. ఇక `పెళ్లిచూపులు` వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఓ ట్రెండ్ సెట్ చేసిన రీతు వర్మ.. అప్పట్నుంచీ గ్రేస్‌ఫుల్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ వస్తున్నారు. టూ టౌన్, నిన్ను కోరి వంటి విజయాల తర్వాత ప్రస్తుతం `భారతవర్ష`వంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటించారు.
తనదైన నటన- సహజమైన అందంతో తెలుగు తెరపై ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈషా రెబ్బ.. ఓం శాంతి శాంతి శాంతిహి అనే చిత్రంలో నటించడమే గాక 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోను నటించారు. తదుపరి వస్తా నీ వెనుక (రమేష్ వర్మ దర్శకత్వం) చిత్రంలో నటించారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే
టైటిల్ లేని విక్రమ్ ప్రభు ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆయిరం జెన్మంగల్ (దర్శకుడు ఎజిల్) – డిసెంబర్ లో విడుదల కానుంది. కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలు.. వెబ్ సిరీస్‌ల ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల, తన డీప్ పెర్ఫార్మెన్సెస్‌తో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఇటీవల విడుదలైన అగధ చిత్రంతోను కామాక్షి పేరు మార్మోగింది. తనదైన ఫియర్‌లెస్ యాటిట్యూడ్ తో ఆకట్టుకోవడం ఈ భామ ప్రత్యేకత.
బిగ్‌బాస్ ద్వారా వెలుగులోకి వచ్చి... గ్లామర్ పాత్రలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే దివి వద్యత పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ తన కెరీర్‌ను మలుచుకుంటున్నారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీలు .. డిజిటల్ కంటెంట్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీ గౌరి ప్రియ, వరుస ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు.
`పెదకాపు 1` వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అభినయంతో ఆకట్టుకున్న శివానీ నాగరం ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న తెలుగమ్మాయి మానస వారణాసి గ్లామర్ ప్రపంచంలో తన అందచందాలతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యకలాపాలతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.