సామ్ అందాల కిక్కు.. లుక్స్ తోనే కిల్ చేసేలా..

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది.

Update: 2024-05-23 14:17 GMT

సమంత గతంలో మాదిరిగా రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. హాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సామ్ ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.


ఆ మధ్య సమంత.. డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు మాత్రమే బయటకొచ్చాయి. స్ట్రీమింగ్ డిటైల్స్ తోపాటు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ వంటి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను రివీల్ చేయలేదు మేకర్స్. కానీ ఈ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇంగ్లీష్ సిటాడెల్ మంచి హిట్ అవ్వడంతో.. ఇండియన్ వెర్షన్ పై హైప్ క్రియేట్ అయింది. ఇక సమంత నటిస్తుండడంతో టాలీవుడ్ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ త్వరలోనే ఫేమస్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇండియన్ వెర్షన్ కు సిటాడెల్ హనీ బన్నీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. హనీ నేమ్ పై సామ్ యాక్షన్ లుక్ తోపాటు బన్నీ పేరుపై వరుణ్ లుక్ ను రివీల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సామ్ గ్లామర్ డోస్ తో జనాలను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.

రీసెంట్ గా ఆమె ఎద అందాలు హైలెట్ అయ్యేలా డిఫరెంట్ డ్రెస్ లో స్టిల్ ఇచ్చింది. ఇక తన క్రీమ్ కలర్ ప్యాంట్ కూడా హైలెట్ అవుతోంది సామ్ క్యూట్ గా తన లుక్స్ తో ఆకట్టుకుంటుందీ చిన్నది. సమంతను ఇలా చూస్తూ సంబరపడిపోతున్నారు ఆమె ఫ్యాన్స్. సమంత చాలా ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తోందని, ఇలా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు. మళ్లీ వరుస చిత్రాలతో అలరించాలని కోరుతున్నారు.

ఇక సమంత తెలుగులో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేయాలని ఆలోచిస్తోంది. గతంలో మాదిరిగా ఆమె రోటోన్ సినిమాలు చేయడం లేదు. ఇక ఛాన్స్ దొరికితే మంచి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఆమధ్య యశోద బాక్సాఫీస్ వద్ద బాగానే క్లిక్కయ్యింది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం అంతగా ఆడలేదు.

Tags:    

Similar News