• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను ఎప్పుడూ దాన్ని...

నేను ఎప్పుడూ దాన్ని నెగెటివ్‌ గా చూడను : సమంత

| టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ఏడాది బ్రేక్ తర్వాత ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-06-05 17:30 GMT

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ఏడాది బ్రేక్ తర్వాత ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల షూటింగ్స్ తో పాటు కమర్షియల్‌ యాడ్స్ షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా ఈఅమ్మడికి ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్‌ వ్యూడ్‌ ఇండియన్‌ స్టార్స్ జాబితాలో చోటు దక్కింది.

ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ తో పాటు సౌత్‌ స్టార్స్ ని వెనక్కి నెట్టి మరీ సమంత ఏకంగా 13వ స్థానంలో నిలిచింది. ఈ విషయమై తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. తనకు దక్కిన గుర్తింపుతో మరింత బాధ్యత పెరుగుతుందని చెప్పుకొచ్చింది.

ఐఎండీబీ ర్యాంకింగ్‌ లో 13వ స్థానం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. కెరీర్‌ ను ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టినట్లుగా ఉంది. అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచి పోయాయి అంటే ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను అంది.

ఇండస్ట్రీలో పోటీ వల్ల మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి రంగంలో కూడా ఒకరితో ఒకరు పోల్చుకుని, ఒకరి కంటే మరొకరు ఎక్కువగా కష్టపడాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇతరుల విజయాలను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతాను.

ఇండస్ట్రీ లో ఉన్న పోటీని నేను ఎప్పుడు కూడా నెగెటివ్ గా చూడను. నాకు పోటీ అనేది మరింతగా స్ఫూర్తిని ఇస్తుంది. ఇతరులను చూసి నేర్చుకుంటాను తప్ప నెగెటివ్‌ గా ఆలోచించి కెరీర్‌ లో నష్టపోను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సమంత నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతుంది. మరో వైపు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది ఖుషి చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సమంత మరిన్ని సినిమాలతో ముందు ముందు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Tags:    
  • Samantha 
  • Actress 
  • Filmindustry 
  • Maaintibangaram 
  • IMDB 
  • Movies 
  • Citadel 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS