• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంతను టాలీవుడ్ ఫస్ట్...

సమంతను టాలీవుడ్ ఫస్ట్ మూవీలో రిజెక్ట్ చేశారా?

| ఇక యాక్టింగ్ తోపాటు అందంలో ఈమె తర్వాతే ఎవరైనా. కేవలం కమర్షియల్ రోల్సే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-01-29 08:15 GMT

సమంత రూత్ ప్రభు.. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఇండియా టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. తెలుగులో దాదాపు అందరూ అగ్రహీరోలకు జోడీగా నటించి అలరించింది సామ్. సుమారు రూ.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ తక్కువ సమయంలోనే హీరోలతో సరి సమానంగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ సమంతనే.

ఇక యాక్టింగ్ తోపాటు అందంలో ఈమె తర్వాతే ఎవరైనా. కేవలం కమర్షియల్ రోల్సే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. జెస్సీగా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది సమంత. మొదటి చిత్రం ఏమాయ చేశావేతో అందరినీ మాయ చేసింది.

ఆ మూవీలో తన నటన తో ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాలో ఆమెను ఎంతో అట్రాక్టివ్ గా చూపించారు. ఇక ఈ మూవీతో సామ్ కెరీర్ మలుపు తిరిగిపోయింది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. ఇక సమంత సినీ కెరీర్ ను మలుపు తిప్పిన మూవీగా ఏమాయ చేసావే అని చెప్పుకోవచ్చు. ఈ మూవీతోనే సమంత టాలీవుడ్ కు పరిచయమైంది.

మొదటి సినిమానే సామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే సమంత హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైమ్ ఆటోలో ఓ సినిమా ఆడిషన్ కు వెళ్లిందట. ఆ మూవీ మేకర్స్ ఆమెను రిజెక్ట్ చేశారట. ఆ చిత్రం.. 2010లో విడుదలైన స్నేహగీతం. లార్స్కో చిత్ర పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మాతగా మధురా శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మూడు ప్రేమ జంటల మధ్యలో తిరిగే ఆ కథలోనే సందీప్ కిషన్, వెంకీ అట్లూరి ( ఇప్పుడు దర్శకుడు), చైతన్య హీరోలుగా నటించారు. ఇక శ్రేయ ధన్వంతరి, సుహాని, మహిమ హీరోయిన్స్ గా నటించారు.

ఫస్ట్ మూవీగా అలా ఛాన్స్ అందుకోవాల్సిన సమంత రిజెక్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు స్టార్ డమ్ తెచ్చుకుంది. గతేడాది శాకుంతలం, ఖుషి మూవీలతో వచ్చిన సమంత.. త్వరలోనే సిటాడెల్ అనే ఇంటర్నేషనల్ సిరీస్ తో రానుంది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరో లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.





 


Tags:    
  • Samantha 
  • Tollywood 
  • Actresssamantha 
  • Filmindustry 
  • Snehageetham 
  • Emayachesavey 

Similar News

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS