రెడ్ కలర్ చీరలో మెస్మరైజ్ చేస్తున్న సమంత!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి, ఎట్టకేలకు డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ బైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో రెండవ వివాహం చేసుకుంది.;
అగ్ర కథానాయిక సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాల ద్వారా ఎంత క్రేజ్ అయితే అందుకుందో.. వ్యక్తిగతంగా అన్నే విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో ప్రముఖ హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిన ఈమె.. ఆ ప్రేమ కొంతకాలం కూడా నిలవలేకపోయింది. ఆ తర్వాత తన తొలి తెలుగు చిత్రం ఏ మాయ చేసావే సినిమాలో హీరోగా నటించిన అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి మరీ క్రిస్టియన్ , హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత మజిలీ అంటూ పలు చిత్రాలలో నటించిన ఈ జంట కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించారు. ఇక వైవాహిక జీవితంలో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు ప్రకటించింది. ముఖ్యంగా నాలుగు ఏళ్లకు విడాకులు ప్రకటించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వీళ్లను కలిపే ప్రయత్నం చేసినా కుదరలేదు. తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి, ఎట్టకేలకు డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ బైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో రెండవ వివాహం చేసుకుంది.
ఈ వివాహాన్ని సమంత అధికారికంగా ప్రకటిస్తూ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది. ఇకపోతే ఈరోజు ఆమె స్నేహితురాలు సమంత పెళ్లి వేడుకలకు సంబంధించి..ఎవరూ చూడని కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ముఖ్యంగా అందులో సమంత ఎరుపు రంగు చీర కట్టుకొని చాలా క్యాజువల్ లుక్ లో అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. రెడ్ కలర్ చీర కట్టుకున్న ఈమె దీనికి కాంబినేషన్లో రెడ్ కలర్ బ్లౌజ్ తో తన మేకవర్ను ఫుల్ ఫిల్ చేసింది. ముఖ్యంగా జుట్టును బన్ రూపంలో ముడిపెట్టి.. చుట్టూ పూలు పెట్టి చాలా సాంప్రదాయంగా కనిపించింది. ఎరుపు రంగు చీరలో అందరి హృదయాలను దోచుకుంది సమంతా అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలు చూసి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సమంత విషయానికి వస్తే.. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఈమె శుభం అనే సినిమాను నిర్మించి, మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మాయ అనే ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. యాక్షన్ పర్ఫామెన్స్ బేస్డ్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు సమంత అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్లో తన భర్త ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు దర్శకత్వంలో వస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.