సమంత మరో కొత్త ప్రయత్నం..?
సిటాడెల్ తర్వాత తెలుగులో తన సొంత ప్రొడక్షన్లో చేసిన శుభం సినిమా కోసం క్యామియో రోల్ చేసింది సమంత.;
సిటాడెల్ తర్వాత తెలుగులో తన సొంత ప్రొడక్షన్లో చేసిన శుభం సినిమా కోసం క్యామియో రోల్ చేసింది సమంత. ఆ సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా కూడా సమంత తన ట్రాలాలా బ్యానర్ నుంచి మంచి ప్రయత్నమే చేసిందని అనిపించింది. ఐతే నెక్స్ట్ ట్రాలాలా ప్రొడక్షన్ నుంచి సమంత లీడ్ రోల్ లో మా ఇంటి బంగారం సినిమా వస్తుంది. ఆ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో అప్డేట్ ఐతే రాలేదు. ఇదిలాఉంటే సమంత నిర్మాతగా మరో మూవీ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
మా ఇంటి బంగారం అనౌన్స్..
నిర్మాతగా సమంత తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో ఫస్ట్ సినిమా మా ఇంటి బంగారం అనౌన్స్ చేసినా అది వెనక్కి వెళ్లి శుభం సినిమా రిలీజైంది. ఇక నెక్స్ట్ తన బ్యానర్ లో 3వ సినిమా మొదలు పెట్టే పనుల్లో ఉందట సమంత. ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్ కి సమంత ఫిదా అయిపోయిందట. ఫైనల్ వెర్షన్ కథ రెడీ అయ్యాక కాస్టింగ్ ఎంపిక జరుగుతుందని టాక్.
సమంత బ్యానర్ నుంచి వస్తున్న థర్డ్ మూవీ కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో వస్తుందట. సినిమా కూడా లిమిటెడ్ బడ్జెట్ తోనే చేయబోతున్నారని టాక్. హీరోయిన్ నిర్మాతగా మారి సినిమాలు చేయడం బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ సౌత్ లో అది కూడా తెలుగు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఇలా హీరోయిన్ గానే కాదు నిర్మాతగా సినిమాలు చేస్తుండటం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.
టాప్ హీరోలందరితో నటించిన సమంత..
ఇక తెలుగులో సమంత హీరోయిన్ గా ఖుషి సినిమా చేసింది. మా ఇంటి బంగారం వస్తుందని అంటున్నారు కానీ ఆ సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. సమంత తో రాజ్ అండ్ డీకే మరో బాలీవుడ్ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇటు ఓ పక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చూసుకుంటుంది సమంత. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోలందరితో నటించిన సమంత ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలకే తన మొదటి ప్రాధాన్యత అనేస్తుందట. కమర్షియల్ సినిమాలు కూడా చేస్తుందట కానీ అందులో తన పాత్ర కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని అంటుంది. అందుకే ఆ సినిమాల ఎంపిక లేట్ అవుతుంది. ఇక టైర్ 2 హీరోలతో కూడా సమంత సేం కండీషన్ తోనే సినిమాలు చేస్తా అంటుందట.
మొన్నటిదాకా హెల్త్ ఇష్యూస్ తో సినిమాలను దూరం పెట్టిన సమంత ఇప్పుడు పర్ఫెక్ట్ లీ ఆల్ రైట్ అని తెలుస్తుంది. అందుకే అమ్మడు మళ్లీ కెరీర్ బిజీ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ లో సినిమాలు.. బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లు ఇలా టఫ్ టైం లో కూడా సమంత తన క్రేజీ ఛాన్స్ లతో అలరిస్తుంది. తప్పకుండా రాబోతున్న సినిమాలు, సీరీస్ లతో సందడి చేస్తుందని చెప్పొచ్చు.