సమంత ‘శుభం’.. పర్ఫెక్ట్ రిస్క్!

సమంత రూత్ ప్రభు నిర్మాతగా రూపొందిన ‘శుభం’ సినిమా మే 9న రిలీజ్‌ కాబోతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-05-07 10:45 GMT

సమంత రూత్ ప్రభు నిర్మాతగా రూపొందిన ‘శుభం’ సినిమా మే 9న రిలీజ్‌ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్‌లో రూపొందిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ కోసం సమంత డెడికేషన్ మాములుగా లేదు. సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడిని రికవర్ చేసుకుని, టేబుల్ ప్రాఫిట్ సాధించినట్లు ఇన్‌సైడ్ టాక్. జీ శాటిలైట్ హక్కులను, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ను భారీ రేటుకు దక్కించుకుంది.

‘ఓ బేబీ’, ‘ఖుషి’ లాంటి సినిమాలు ఓటీటీ లో భారీ వ్యూస్ తెచ్చుకున్న నేపథ్యంలో, సమంత బ్రాండ్‌పై నమ్మకంతో పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సమంత తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమాను నిర్మించింది. రిలీజ్‌కు ముందే ప్రమోషన్స్‌లో వెరైటీ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత స్వయంగా ప్రమోషన్స్ బాధ్యత తీసుకుని, వెరైటీ ప్రోమోలు కట్ చేయించడం, సెలబ్రిటీలతో డాన్స్ రీల్స్ చేయడం, వీడియో బైట్స్ తీసుకోవడం వంటివి చేసింది.

సమంత క్యామియో రోల్‌లో నటించినప్పటికీ, దాన్ని ఎక్కువగా హైలైట్ చేయకుండా, సినిమా కంటెంట్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్కువ ప్రయత్నించింది. ఈ సినిమా టీవీ సీరియల్స్ పిచ్చిలో దెయ్యాలుగా మారిన భార్యల కథగా వెరైటీ కాన్సెప్ట్‌తో రూపొందింది. ఇక సమంత ప్రీమియర్ షోలతో సినిమా హైప్‌ను పెంచడం నిర్మాతగా మరో రిస్కీ స్టెప్.

హైదరాబాద్‌లో నిన్న రాత్రి ఒక షో పూర్తి కాగా, ఈ రోజు మరికొన్ని షోలను జోడించారు. వైజాగ్‌లో కూడా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ షోలన్నీ హౌస్‌ఫుల్‌తో బుక్ అవుతున్నాయి, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ప్రీమియర్ షోల నుంచి వచ్చిన టాక్ పాజిటివ్‌గా ఉంది, ఇది రిలీజ్ డే ఓపెనింగ్స్‌పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాలకు రప్రీమియర్స్ రిస్క్ తీసుకోకపోతే కలిసి రాకపోవచ్చు. కాబట్టి పర్ఫెక్ట్ టైమ్ లో సామ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నట్లు అర్ధమవుతుంది.

సమంత నిర్మాతగా తొలి అడుగుగా ‘శుభం’ సినిమా భారీ రిస్క్ కాకపోయినా, లాభాల కంటే ఎక్కువగా తన తొలి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని ఆశిస్తోంది. సినిమా బడ్జెట్, నాన్ థియేట్రికల్ డీల్స్ ద్వారానే మొత్తం రికవర్ అయినట్లు తెలుస్తోంది. ఈ డీల్స్ సినిమాకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టాయి. అంటే సమంత నిర్మాతగా తొలి విజయాన్ని అందుకున్నట్లే. సమంత బ్రాండ్ వాల్యూ, ఆమె సినిమాలు ఓటీటీలో సాధించిన విజయాలే ఈ డీల్స్‌కు కారణమని అంటున్నారు.

సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ నటిస్తున్నారు. కాస్టింగ్‌లో స్టార్ హీరోలు లేకపోవడం సినిమాకు ఒక సవాలుగా ఉన్నప్పటికీ, సమంత ప్రమోషన్స్‌తో ఈ లోటును భర్తీ చేస్తోంది. టీవీ సీరియల్స్ అడిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ, భార్యలు దెయ్యాలుగా మారడం, భర్తలు వారిని కాపాడుకునే క్రమంలో జరిగే కామెడీ, థ్రిల్స్‌తో ఆకట్టుకుంటుందని టాక్.

Tags:    

Similar News