మ్యాగజైన్ కవర్‌షూట్: సమంత సరికొత్త ఫ్యాషన్ విన్యాసం
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన స్టైలింగ్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన స్టైలింగ్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. పాపులర్ `ది నాడ్` మ్యాగజైన్ కవర్‌షూట్ కోసం సామ్ ధరించిన సరికొత్త అవుట్‌ఫిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఫ్యాషన్ ప్రపంచంలో సమంత ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని ఈ తాజా వీడియో నిరూపిస్తోంది. సామ్ ధరించిన రంగుల ఎంపిక నుండి తన బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతిదీ ఎంతో ప్రొఫెషనల్‌గా -ఆకర్షణీయంగా ఉంది.
ఈ ఫోటోషూట్‌లో ప్రధాన ఆకర్షణ తను ధరించిన `చిలుకాకు పచ్చ` రంగు గౌను. ఈ రంగు సమంత ఛాయకు మరింత గ్లామర్‌ను జోడించింది. దానికి తోడు తన టోన్డ్ థై సొగసును ఎలివేట్ చేసేలా డిజైన్ చేసిన బ్లాక్ మిడీ సమంత రూపాన్ని ఎంతో స్పైసప్ చేసింది. ట్రెడిషనల్ రంగులకు మోడ్రన్ కట్స్ జోడించి సమంత ప్రదర్శించిన ఈ సరికొత్త రూపం ఫ్యాషన్ ప్రియులకు కనువిందు చేస్తోంది.
వీడియోలో గాలికి ఎగిరే ఆ చున్నీ ఫోటోషూట్‌కు ఒక డైనమిక్ వైబ్ ని ఇచ్చింది. సాధారణంగా కదలిక లేని ఫోటోల కంటే ఇలా మూవ్‌మెంట్ ఉన్న గ్లింప్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. సమంత తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీని చూపిస్తూ ఇచ్చిన పోజులు ఫిట్‌నెస్ విషయంలో తన అంకితభావాన్ని చాటిచెబుతున్నాయి. ఈ ఫోటోషూట్‌లోని ప్రతి ఫ్రేమ్ ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
మ్యాగజైన్ కవర్‌షూట్‌లు అంటేనే సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించేవి. సమంత ది నాడ్ ఫోటో షూట్‌లో కేవలం అందంగా కనిపించడమే కాదు... ఒక పరిపూర్ణమైన ఫ్యాషన్ ఐకాన్‌గా తన ముద్ర వేసింది. సమంత ఫ్యాషన్ సెన్స్ నిజంగానే `మైండ్ బ్లోయింగ్` అనిపించేలా ఉంది. వైవిధ్యమైన దుస్తులను ధరించడంలో ప్రయోగాత్మకత, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఓవరాల్ గా సమంత మరోసారి తన గ్లామర్ పవర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఇలాంటి హై-ఎండ్ ఫ్యాషన్ షూట్స్‌లో కూడా తనే రాణి అని నిరూపించుకుంది. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ పైనే ఫోకస్ చేసింది. దీనికి కారణం నిర్మాతగాను సత్తా చాటాలనే పట్టుదల.