సింపుల్ అండ్ కంఫర్ట్.. క్రేజీ ఫోజులతో ఆకట్టుకుంటున్న సమంత!
తాజాగా ఈ బ్లాక్ అవుట్ ఫిట్ లో చాలా ట్రెండీగా కనిపిస్తూనే మరొకవైపు సెల్ఫీ ఫోజులతో మెప్పించింది.
ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన సమంత సినీ ప్రయాణం.. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా నిలిపింది. ఒకటి కాదు రెండు కాదు పదుల సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసింది. ప్రస్తుతం అన్నింటికి దూరంగా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ.. రాబోయే బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమంత రోజుకొక ఫోటో షూట్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.
సింపుల్ గా.. మరింత కంఫర్ట్ గా..
వరుసగా బేబీ బంప్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తున్న సమంత.. తాజాగా మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది . ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డిజైన్ చేసిన లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫిట్ తో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేసింది ఈ చిన్నది. బేబీ బంప్ కి కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా బ్లాక్ కలర్ ఫ్లేర్ మినీ ఫ్రాక్ టైప్ డ్రెస్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్ లో బ్లాక్ కలర్ ఫ్యాంట్ ధరించింది. దీనికి మ్యాచింగ్ గా బ్లాక్ కలర్ కోట్ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీలో కంఫర్ట్ గా ఉండే దుస్తులను మహిళలు ఎంపిక చేసుకుంటారనే విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సమంత కూడా ఒకవైపు కంఫర్ట్గా ఆలోచిస్తూనే .. మరొకవైపు ఫ్యాషన్ ఉట్టిపడేలా దుస్తులను ధరించింది. అంతేకాదు అమమ జువెలర్స్ డిజైన్ చేసిన చెవి దిద్దులతో మరింత అట్రాక్షన్ గా నిలిచింది సమంత.
సెల్ఫీ ఫోజులతో సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్..
తాజాగా ఈ బ్లాక్ అవుట్ ఫిట్ లో చాలా ట్రెండీగా కనిపిస్తూనే మరొకవైపు సెల్ఫీ ఫోజులతో మెప్పించింది. మరికొన్ని ఫోటోలలో యాష్ కలర్ టీ షర్ట్ ధరించిన ఈమే బ్లాక్ కలర్ మినీ షాట్ ధరించి మరో సెల్ఫీ పిక్ ను షేర్ చేసింది.పైగా ఈ ఫోటోలలో బుంగమూతి పెట్టుకున్న సమంత.. తన అందాలతో మెస్మరైజ్ చేసింది . మొత్తానికైతే మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.
ప్రెగ్నెన్సీలో కూడా ఆ పని కెరియర్ బిల్డప్..
సమంత కష్టజీవి అని మరోసారి నిరూపించింది. ఇటీవలే నిర్మాతగా మారి శుభం అనే సినిమా నిర్మించి మంచి విషయాన్ని అందుకున్న ఈమె.. మరొకవైపు మా ఇంటి బంగారం సినిమాని నిర్మించడంతోపాటు నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరొకవైపు సోనీ లివ్ తమిళ్ తో రాబోయే డిజిటల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళ్ భాష ఓటిటి కంటెంట్ లోకి తిరిగి అడుగుపెడుతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఫాంటసీ యాక్షన్ సిరీస్ రక్త బ్రహ్మాండంలో కూడా నటిస్తోంది . అయితే ప్రెగ్నెన్సీ కారణంగా సమంత ఈ సిరీస్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ , అలీ ఫజల్ వంటి వారు నటిస్తున్నారు.