పుట్టబోయే బిడ్డ పేరు అదే.. సమంత క్రేజీ కామెంట్స్!

సమంత మాట్లాడుతూ.." ఒక పేరును ఎంచుకోవడం అనేది చాలా కష్టం. దీనికి మీ అందరి సహాయం కావాలి" అంటూ సమంత తెలిపింది.

Update: 2026-08-29 04:25 GMT

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటూ.. సినిమాలను నిర్మిస్తూ అటు హీరోయిన్గా ఇటు నిర్మాతగా బిజీగా మారిపోయింది. ఇకపోతే బాలీవుడ్ డైరెక్టర్ , నిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత మరింత బిజీగా మారిన సమంత.. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీనికి కారణం ఆమె గర్భం దాల్చడం.

పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడతారు?

తన జీవితంలో ఎంతో మధురమైన క్షణాలను ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాను అంటూ చెప్పిన సమంత ఒకవైపు బేబీ మూన్ ట్రిప్పును ఎంజాయ్ చేస్తూ.. మరొక వ్యాయామం చేస్తూ అభిమానులతో ఫోటోలను పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా లైవ్ చిట్ చాట్ సెషన్ నిర్వహించగా.. అందులో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. అందులో భాగంగానే ఒక అభిమాని పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? అని అడగగా తనదైన శైలిలో స్పందించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

సమంత క్రేజీ రియాక్షన్..

సమంత మాట్లాడుతూ.." ఒక పేరును ఎంచుకోవడం అనేది చాలా కష్టం. దీనికి మీ అందరి సహాయం కావాలి" అంటూ సమంత తెలిపింది. మొత్తానికైతే తన జీవితంలోకి రాబోతున్న ఒక కొత్త ఊపిరి కోసం ఎదురు చూస్తూనే.. మరొకవైపు తనకు పుట్టే బిడ్డకు పెట్టే పేరును అభిమానులకే వదిలేయడం నిజంగా ప్రశంసనీయమంటూ సమంతను అభిమానులు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. ఏది ఏమైనా సమంత అభిమానులను ఏ విధంగా ఆరాధిస్తుందో ఈ ఒక్క ఘటన చాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అభిమానుల ప్రశ్నలకు సమంత సమాధానం..

ఇకపోతే ఇదే లైవ్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమంత అంతే ఓపికగా సమాధానం ఇచ్చారు. ప్రెగ్నెన్సీ దశను ఆస్వాదిస్తున్నారా? అని ఒక అభిమాని అడగగా .. "మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను" అంటూ సమంత తెలిపారు. ఇక కొత్త తల్లిగా మీ అనుభవాల గురించి చర్చిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తోంది ? అని అడగగా ఆ క్షణాలను మరింత గొప్పగా ఆస్వాదిస్తున్నాను ముఖ్యంగా అమ్మ అని పిలిపించుకోవడానికి ఎదురు చూడలేకపోతున్నాను అంటూ బదులిచ్చింది.

డిసెంబర్లో మొదటి బిడ్డ రాక..

సమంత జూన్ లో తన గర్భధారణను ప్రకటించింది. ఇప్పుడు తన బిడ్డ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. డిసెంబర్లో తమ మొదటి బిడ్డకు ఈ జంట ఆహ్వానం పలుకుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సమంత ఒకవైపు ప్రెగ్నెన్సీ జర్నీని ఆస్వాదిస్తూనే.. తన ఫిట్నెస్ దినచర్యతో అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. సమంత విషయానికి వస్తే.. ఇటు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఆమె విశ్రాంతి తీసుకోవడం లేదు. సోనీ లైవ్ తమిళ్ తో ఒక కొత్త ప్రాజెక్టు ప్రకటించింది. సమంత వరుస బిజీ షెడ్యూల్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు.

Tags:    

Similar News