ప్యారడైజ్.. ఇది ఎవరూ ఊహించలేదేమో!
థియేటర్లలో వచ్చిన టాక్ ఒకలా ఉంటే.. ఓటీటీలో కనిపిస్తున్న రెస్పాన్స్ మరోలా ఉంది.
థియేటర్లలో వచ్చిన టాక్ ఒకలా ఉంటే.. ఓటీటీలో కనిపిస్తున్న రెస్పాన్స్ మరోలా ఉంది. నేచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ సినిమా ఇప్పుడు అదే విషయంతో హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ మూవీ.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. దీంతో థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ కు, ఓటీటీలో కనిపిస్తున్న ఆదరణకు మధ్య డిఫరెన్స్ కోసం ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
నిజానికి ప్యారడైజ్ మూవీకి ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే, మొదట్లో వచ్చిన విమర్శల ఎఫెక్ట్ పూర్తిగా కనిపించలేదని చెప్పాలి. అనేక ప్రాంతాల్లో సినిమా ఇన్వెస్ట్మెంట్ ను రాబట్టుకున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల చాలా తక్కువ నష్టాలు వచ్చినా.. ఓవరాల్ గా కమర్షియల్ హిట్టే.
ఆ విషయంలో మేకర్స్ పోస్ట్ ప్రమోషన్స్ కూడా హెల్ప్ అయ్యాయి. ప్రీమియర్స్ టాక్ తో అస్సలు నిరాశపడకుండా సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేశారు. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత మూవీ పరిస్థితి మరోలా మారింది. థియేటర్లలో వచ్చిన నెగిటివ్ టాక్.. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక కూడా కంటిన్యూ అవుతుందని కొందరు భావించినా.. ట్రెండింగ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కు చేరుకోవడం విశేషం. స్ట్రీమింగ్ మొదలైన ఒక్క రోజులోనే ఆ ప్లేస్ దక్కించుకోవడంతో సినిమాపై మరోసారి చర్చ మొదలైంది.
థియేటర్లలో సినిమా చూడలేకపోయినవారు, అప్పట్లో వచ్చిన టాక్ కారణంగా సినిమాకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోనే తమకు నచ్చిన సమయంలో సినిమా చూసే అవకాశం ఉండటంతో పాటు, థియేటర్లలో వచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా ఓటీటీలో కొందరికి సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే, ఒక్కరోజు ట్రెండింగ్ ఆధారంగా మూవీ ఓటీటీలో బ్లాక్బస్టర్ అయిందని చెప్పలేం. రాబోయే రోజుల్లో వచ్చే వ్యూస్, ప్రేక్షకుల ఆదరణను కూడా చూడాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఓటీటీ వెర్షన్ విషయంలో మేకర్స్ చేసిన మార్పులు పెద్ద హెల్ప్ అయినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో విమర్శలు ఎదుర్కొన్న ఉన్న కొన్ని సీన్స్ తొలగించడంతో పాటు, రన్ టైమ్ ను బాగా తగ్గించారు. మరికొన్ని సీన్లను కొత్తగా యూడ్ చేశారు. దీంతో ఓటీటీలో ప్రేక్షకులు చూస్తున్న సినిమా థియేటర్లలో చూసిన వెర్షన్ కు భిన్నంగా ఉంది.
ఆ ఛేంజెస్ మాత్రమే ప్రేక్షకుల రెస్పాన్స్ పై పూర్తి ఎఫెక్ట్ చూపించాయనే చెప్పలేకపోయినా.. హెల్ప్ అయ్యాయని చెప్పడంలో మాత్రం డౌట్ అక్కర్లేదు. అందుకే థియేటర్లలో విమర్శలు ఎదుర్కొన్న సినిమా ఓటీటీలో టాప్ ప్లేస్ కు చేరుకోవడం మాత్రం ప్యారడైజ్ టీమ్ కు రిలీఫ్ ఇచ్చే విషయమే. అలా ప్యారడైజ్ మూవీ జర్నీ చూస్తుంటే.. థియేటర్లలో వచ్చిన టాక్ తోనే ఓ సినిమా ఓటీటీ ఫ్యూచర్ ను అంచనా వేయలేమని మరోసారి క్లియర్ గా తెలుస్తోంది.