ప్రభాస్ తో ఎక్కువ సినిమాలలో నటించిన ఆ ముగ్గురు పెళ్లికి దూరమేనా?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. 46 ఏళ్లు దాటినా ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గానే ఉంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే ఈ రోజు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు దేశవ్యాప్తంగా పండుగలా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభాస్‌తో కలసి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగానే ఉండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు చూద్దాం..
దేవసేన అనుష్క శెట్టి.. ఇప్పటికీ సింగిలే:
ప్రభాస్, అనుష్క శెట్టిల జంటకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ వంటి సంచలన చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు ఎన్నో వచ్చినా, తాము కేవలం ప్రాణస్నేహితులం మాత్రమేనని అనుష్క స్పష్టం చేసింది. ఇక మార్చిలో ఒక బిజినెస్‌మ్యాన్‌తో ఆమెకు పెళ్లి అంటూ వచ్చిన వార్తలను కూడా అనుష్క టీమ్ ఖండించింది. ప్రస్తుతం ఆమె తన ప్రాజెక్టులపైనే పూర్తి దృష్టి పెట్టి సింగిల్‌గానే ఉంటోంది.
42 ఏళ్లొచ్చినా పెళ్లికి దూరంగానే త్రిష:
ప్రభాస్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన వర్షం సినిమాతో పాటు పౌర్ణమి, బుజ్జిగాడు చిత్రాల్లో త్రిష హీరోయిన్గా నటించి మెప్పించింది. 42 ఏళ్లు దాటినా త్రిష కూడా పెళ్లి పీటలు ఎక్కలేదు. గతంలో 2015లో చెన్నైకి చెందిన బిజినెస్‌మ్యాన్ వరుణ్ మనియన్తో నిశ్చితార్థం జరిగినా, కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. ఇక ఇటీవల చండీగఢ్ వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ వచ్చిన రూమర్లపై కూడా త్రిష వ్యంగ్యంగా స్పందిస్తూ అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది.
తమన్నా ఆలోచన వేరే.. పెళ్లిపై క్లార్టీ:
ప్రభాస్‌తో కలిసి రెబల్, బాహుబలి: ది బిగినింగ్ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సమాజం లేదా బంధువుల ఒత్తిడి కోసం కాకుండా తనకు నచ్చినప్పుడు, సరైన సమయం చూసుకునే పెళ్లి చేసుకుంటానని తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెగేసి చెప్పేసింది.
బర్త్‌డే వేళ క్రేజీ సినిమాల లైనప్:
మరోవైపు మన 'డార్లింగ్' ప్రభాస్ కూడా ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాలపైనే పూర్తి కాన్సంట్రేషన్ పెట్టేశాడు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ లభిస్తోంది. పీరియాడిక్ డ్రామా 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', అలాగే సెన్సేషనల్ హిట్ 'కల్కి 2' వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో రాబోయే రెండేళ్లపాటు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రికార్డుల వేట కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మొత్తానికి చూస్తే, వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్ మరియు ఆయన కాంబినేషన్ హీరోయిన్లు అనుష్క, త్రిష, తమన్నా.. అందరూ రియల్ లైఫ్‌లో మాత్రం పెళ్లికి దూరంగా ఉంటూ కెరీర్‌పైనే దృష్టి పెట్టడం గమనార్హం. ఏదేమైనా పుట్టినరోజు జరుపుకుంటున్న డార్లింగ్ ప్రభాస్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.