ఈ స్టార్ హీరో మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.500 .. ఇంతకీ ఇది ఏ బ్రాండ్?
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ తన ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ తన ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అతడు కేవలం ఆరోగ్యకరమైన ఆహారానికే కాకుండా.. తాను తాగే మినరల్ వాటర్ విషయంలోనూ ఎంతో ఖరీదైన అభిరుచిని కలిగి ఉన్నారు. ఇటీవల టైగర్ ష్రాఫ్ ఇంట్లో తీసిన ఒక వీడియోలో కనిపించిన S.పెలెగ్రినో స్పార్కిలింగ్ మినరల్ వాటర్ బాటిల్ నెట్టింట వైరల్ అయింది.
ఈ వాటర్ బాటిల్ ధర మార్కెట్లో అక్షరాలా రూ. 499 (సుమారు రూ. 500) వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే.. టైగర్ రోజువారీ నీటి వినియోగం కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగితే దాదాపు రూ. 2000 వరకు ఖర్చవుతుంది. ఒక నెలలో కేవలం తాగునీటి బాటిళ్ల కోసమే సుమారు రూ. 90,000 ఖర్చవుతుండగా, ఏడాదికి ఇది దాదాపు రూ. 27 లక్షలకు చేరుకుంటుంది.
అది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలకే పరిమితం చేసినా.. ఏడాదికి సులభంగా రూ. 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయవచ్చు. కేవలం సాధారణ తాగునీటికి బదులుగా ఇలాంటి లగ్జరీ, ప్రీమియం బ్రాండెడ్ మినరల్ వాటర్‌ను ఎంచుకోవడం అతడి ఉన్నత జీవనశైలికి అద్దం పడుతోంది. సెలబ్రిటీల లైఫ్‌స్టైల్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
కేవలం టైగర్ ష్రాఫ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖులు ఇలాంటి ఖరీదైన వాటర్ బ్రాండ్లనే ఇష్టపడుతుంటారు. హాలీవుడ్ స్టార్లు నికోల్ కిడ్మన్, జస్టిన్ టింబర్లేక్ వంటి వారు `ఫిజి వాటర్` ను ఉపయోగిస్తే, రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ వాస్ వాటర్ (VOSS) కోసం ప్రత్యేకంగా రిఫ్రిజిరేటర్‌ను కేటాయించుకున్నారు. అలాగే ప్రముఖ నటుడు డ్వైన్ జాన్సన్ కూడా ఈ బ్రాండ్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు.
ఇదే కాకుండా, భారతీయ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు గిగీ హడిడ్ వంటి అంతర్జాతీయ మోడల్ `ఎవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్‌ను తాగుతుంటారు. ఇక పారిస్ హిల్టన్ వంటి సెలబ్రిటీలు అత్యంత ఖరీదైన `బ్లింగ్ H2O` వాటర్ బాటిల్స్‌ను వాడితే.. జెన్నిఫర్ అనిస్టన్ స్మార్ట్వాటర్`ను ఇష్టపడతారు. మొత్తానికి సెలబ్రిటీల డైట్ - లైఫ్స్టైల్లో ఈ లగ్జరీ వాటర్ బ్రాండ్లు ప్రధాన భాగంగా మారిపోయాయి.