మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ చేయకపోవడానికి అసలు కారణం ఇదేనా?
కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమా తోనే సత్తా చాటుకున్నాడు... మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు...
కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమా తోనే సత్తా చాటుకున్నాడు... మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు... టైర్ వన్ హీరోల్లో ఒకరి గా కొనసాగుతున్న మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కెరియర్ మొదటి నుంచి మహేష్ బాబు కి బాలీవుడ్ లో భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళలేదు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే తన సత్తా చాటాలని ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోగా మారిన తర్వాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తానంటూ ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టారు. అయినప్పటికి మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియాలో సినిమా చేయలేదు. రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న 'వారణాసి' సినిమాతో డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు...
పాన్ ఇండియా మూవీ చేయకపోవడానికి కారణం...
'బాహుబలి' రిలీజ్ అయి పెను సంచలనాలను క్రియేట్ చేసినపుడు తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ ఏర్పడింది. ఆ టైమ్ లో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ అప్పటినుండి స్టార్ డైరెక్టర్లందరు తన దగ్గరికి డిఫరెంట్ కథలతో వచ్చారు. కానీ పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయగలిగే కథాంశాలు అందులో లేవట. అందువల్లే ఆయన సినిమాలు తెలుగు ఇండస్ట్రీ వరకే పరిమితమయ్యాయి. పాన్ ఇండియాలో సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండాలని అక్కడి ప్రేక్షకులందరిని మెప్పించాలని అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకునే రేంజ్ లో ఉండాలని మహేష్ బాబు భావించాడు. అందువల్లే ఆయన ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయలేదు.
ఇక రాజమౌళి చెప్పిన 'వారణాసి' ప్రాజెక్ట్ పాన్ ఇండియా కాదు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుండటం వల్ల మహేష్ బాబు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు రాజమౌళి ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడం వల్ల వారణాసి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక జక్కన్న మహేష్ బాబును ఏ రేంజ్ లో చూపిస్తాడు. పాన్ ఇండియా స్కేల్ ను దాటి ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ వేదిక పైన తెలుగు సినిమా స్థాయి, మహేష్ బాబు నటన ఏ విధంగా ఎలివేట్ అవుతాయో చూడాలి...