ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు..

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.;

Update: 2026-01-27 13:11 GMT

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.ఈ ప్రతిష్టాత్మక వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందులో ఆమె పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఆమె రాజసం వుట్టిపడేలా ఎంతో హుందాగా కనిపించారు. జాతీయ స్థాయి వేదికపై సమంతను చూడటం అభిమానులకు కన్నుల పండుగలా అనిపించింది. కేవలం సినిమా రంగం నుండే కాకుండా వివిధ రంగాల ప్రముఖులు హాజరైన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




తన ఎదుగుదలపై సమంత ఎమోషనల్ పోస్ట్:

ఈ అరుదైన గౌరవంపై సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. "నా ఎదుగుదలలో నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు. ఎప్పటికైనా ఇలాంటి గొప్ప వేదికపై నిలుచుంటానని నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు ముందుకు వెళ్ళడానికి ఎలాంటి మార్గం కనిపించని రోజులు కూడా నా జీవితంలో వున్నాయి. ఇలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో నేను సాహసించలేదు. కానీ నా పని నేను నిబద్ధతతో చేసుకుంటూ వెళ్లాను. ఈ దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది. దీనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ తన మనసులోని మాటను రాసుకొచ్చారు. ఆమె పడ్డ కష్టానికి దక్కిన ఈ గుర్తింపు చూసి అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




ఢిల్లీలో తారల మెరుపులు.. సమంత స్పెషల్ అట్రాక్షన్:

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ గౌరవప్రదమైన విందుకు కేవలం సమంత మాత్రమే కాకుండా, చిత్ర పరిశ్రమకు చెందిన మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే, సమంత పట్టు డిజైనర్ శారీలో చాలా కళాత్మకంగా కనిపించి ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ వేడుకలో సమంత భాగం కావడం ఆమె అభిమానులకు గర్వకారణంగా మారింది. కేవలం ఒక నటిగానే కాకుండా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా ఆమెకు లభించిన గౌరవం ఇది. ఈ వేడుకలో వివిధ రంగాల ప్రముఖులతో కలిసి సమంత గడిపిన క్షణాలు, అక్కడి ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుక ఆమె కెరీర్‌లో ఒక మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.




ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న వారు సైతం ఇప్పుడు ఆమె నటనను, ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారు. రాష్ట్రపతి భవనం నుండి ఆహ్వానం అందడం అనేది ఆమె ఇమేజ్ పాన్-ఇండియా లెవల్‌లో ఎంత బలంగా ఉందో చాటి చెబుతోంది. తాజాగా ఆమె మా ఇంటి బంగారం అనే సినిమా టీజర్ తో అలరించారు.ఈ మూవీ లో ఆమె ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ తో కనిపించనున్నారు.

Tags:    

Similar News