'ఒకసారి నమ్మకం పోతే అంతే'.. డైరెక్టర్ రాజ్ భార్య పోస్ట్
నమ్మకం అనేది అన్నిటికన్నా విలువైనదని చెప్పిన శ్యామాలి.. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు.;
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తరచూ ఇద్దరూ కలిసి కనిపించడంతో రిలేషన్‌లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దానిపై ఇప్పటి వరకు సామ్ గానీ.. రాజ్ గానీ ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. కేవలం ఆమె మేనేజర్ స్పందించారు.
అదే సమయంలో ఊహాగానాల మధ్య.. రాజ్ నిడిమోరు సతీమణి శ్యామాలి పెట్టిన పోస్టులు కొన్ని రోజులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుందని ఇటీవల పోస్ట్ పెట్టిన ఆమె.. ఇప్పుడు నమ్మకాన్ని ఉద్దేశించి నెట్టింట పోస్ట్ చేశారు.
నమ్మకం అనేది అన్నిటికన్నా విలువైనదని చెప్పిన శ్యామాలి.. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. రాజ్, సామ్ త్వరలో రిలేషన్ ను అనౌన్స్ కూడా చేయనున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. నమ్మకం గురించి ఆమె మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఎప్పటికప్పుడు శ్యామాలి ఇన్ స్టాలో పోస్టులు పెడుతుంటారు. కానీ రాజ్, సమంత రిలేషన్ పై వార్తలు వస్తున్నప్పుడు నుంచి ఆమె ఏం పెట్టినా వైరల్ గా మారుతున్నాయి. కాగా.. శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. క్రియేటివ్ కన్సల్టెంట్ గా కూడా వర్క్ చేశారు.
ఆ తర్వాత రాజ్, శ్యామాలి 2015లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప ఉందని సమాచారం. వివాహం తర్వాత రాజ్ నిడిమోరు రూపొందించిన సినిమాలకు క్యాస్టింగ్ లో ఆమె సహాయం చేస్తుండేవారు. అయితే శ్యామాలి చివరిసారిగా 2023లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన పిక్ ను పోస్ట్ చేశారు.
ఇద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చినా.. రాజ్ - శ్యామాలి ఎక్కడా స్పందించలేదు. కాగా, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీసుల కోసం రాజ్, సామ్ కలిసి వర్క్ చేశారు. సమంత ఇటీవల నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. సామ్ అప్ కమింగ్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్ ను రాజ్ నిర్మిస్తున్నారు.