సమంతతో రాజ్ నిడిమోరు.. ఇది అఫీషియల్?
నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్ జర్నీ, రిలేషన్ షిప్ స్టాటస్ గురించి చాలా చర్చ జరుగుతోంది.;
నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్ జర్నీ, రిలేషన్ షిప్ స్టాటస్ గురించి చాలా చర్చ జరుగుతోంది. సమంత చాలా కాలంగా 'ఫ్యామిలీమ్యాన్' దర్శకనిర్మాత రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 సమయంలో మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారిందని, ఇప్పుడు తమ మధ్య రిలేషన్ షిప్ ని అధికారికం చేసారని ఇటీవల మీడియా కథనాలు వండి వారుస్తోంది. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రలో నటించిన సమంత, ఆ తర్వాత సిటాడెల్ హని బన్నీ కోసం రాజ్ అండ్ డీకేతో కలిసి పని చేసారు. ఈ సమయంలో రాజ్ తో బాండింగ్ మరింత బలపడిందని కథనాలొచ్చాయి.
సమంత కెరీర్ ఛాయిస్ లు, అలాగే నిర్మాతగా ప్రయత్నాలకు కూడా రాజ్ నిడిమోరు సమంతకు వెన్నెముకగా నిలుస్తున్నారని, ఆ ఇద్దరి మధ్యా స్నేహాన్ని మించి ఇంకేదో జరుగుతోందన్న గుసగుసలు కూడా ఇప్పటికే వేడెక్కించాయి. దానికి తగ్గట్టే పలు పెద్ద ఈవెంట్లలో ఈ ఇద్దరూ జతగా కలిసి కనిపించారు. కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. హిందీ చిత్రసీమలో స్నేహాల మాదిరిగానే ప్రతిదీ బహిరంగంగానే ఉంచారు. సమంత స్వయంగా అతడితో సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటే, వాటిపై నెటిజనులు కామెంట్లతో వేడెక్కిస్తున్నారు.
ఇప్పుడు కూడా అమెరికా డెట్రాయిట్ లో ఈ జంట చేయి చేయి కలిపి అత్యంత సన్నిహితంగా కనిపించారు. ఈ జోడీ ఇటీవల జరిగిన 'తానా' సభల కోసం అమెరికాలో ఉన్నారు. అక్కడ పబ్లిగ్గానే రాజ్ సమంత భుజం చుట్టూ చేతిని వేసి .. తమ మధ్య బాండింగ్ ఎవరికీ అంతు చిక్కనంత! అని హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. సామ్- రాజ్ మధ్య కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుటవుతోంది... ఇదంతా బహిరంగంగా కనిపిస్తోందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ బేబీయ్ ఇది అధికారికమేనా? అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా, సామ్ మీరు ఇలా ఉండడం సంతోషంగా ఉంది! అంటూ మరొకరు ఎంకరేజ్ చేసారు. ఇక సమంత రాజ్ నిడిమోరు, ఇతర స్నేహితులతో పాటు ఓ రెస్టారెంట్ లో విందులో పాల్గొన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే తమ రిలేషన్ షిప్ గురించి సమంత కానీ, రాజ్ కానీ అధికారికంగా ప్రకటించని సంగతి తెలిసిందే.