రాజ్ తో పెళ్లి.. సామ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ?

స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వివాహ బంధంతో ఒకటయ్యారు.;

Update: 2025-12-02 17:02 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వివాహ బంధంతో ఒకటయ్యారు. సోమవారం ఉదయం.. రాజ్- సామ్ మ్యారేజ్ జరగ్గా.. ఆ తర్వాత అఫీషియల్ వారిద్దరూ అనౌన్స్ చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్‌ లోని లింగ భైరవి ఆలయంలో రాజ్ నిడిమోరు, సమంత వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కొద్దిమంది సమక్షంలో వేడుకలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్- రాజ్ పెళ్లి పిక్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

అదే సమయంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అందులో ఒకటి సామ్ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవ్వడం. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫోటోల్లో సమంత కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. అసలు వచ్చారో రాలేదో కూడా తెలియదు. దీంతో ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకవేళ వస్తే.. ఒక పిక్ లో అయినా కనిపిస్తారు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు అటెండ్ అవ్వలేదో.. అందుకు కారణమేంటోనని మాట్లాడుకుంటున్నారు. అయితే ఎందుకు అటెండ్ అవ్వలేదో వారికే తెలియాలి. సమంత ఫ్రెండ్ శిల్ప మాత్రం హాజరయ్యారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లికి సంబంధించిన పిక్స్ షేర్ చేశారు.

అదే సమయంలో రాజ్ నిడిమోరు ఫ్యామిలీ నుంచి పలువురు అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి సోషల్ మీడియాలో పలు పిక్స్ ను పోస్ట్ చేశారు. రాజ్, సామ్ తో దిగిన ఫొటోస్ ను షేర్ చేయకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే అది ఈశా ఫౌండేషన్ అని చెప్పేయొచ్చు. ఆమె తన కుమారులతో వచ్చినట్లు తెలుస్తోంది. సామ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎవరూ రాలేదని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే పలు ప్రాజెక్టులకు గాను సామ్, రాజ్ వర్క్ చేయగా.. గత ఏడాది నుంచి వారిద్దరూ రిలేషన్‌ షిప్‌ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దానిపై వారు ఎప్పుడూ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. కానీ గత కొన్ని నెలలుగా సమంత తన ఇన్‌ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా కొన్ని హింట్స్ మాత్రం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని సస్పెన్స్ కు తెరదించారు.

Tags:    

Similar News