సామ్, రాజ్ గోవా వెళ్లారా? అక్కడ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశారా?

ఆ తర్వాత రోజు.. సామ్ తన అత్తవారింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన చిత్రాలను రాజ్ నిడిమోరు సోదరి శీతల్.. నెట్టింట్ ఎమోషనల్ నోట్ తో షేర్ చేశారు.;

Update: 2025-12-04 09:49 GMT

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ను నిజం చేస్తూ.. వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడు ప్రముఖ ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధ పద్ధతిలో సామ్- రాజ్ పెళ్లి జరిగింది.

అయితే డిసెంబర్ 1వ తేదీ ఉదయం సమంత, రాజ్ వివాహం జరగ్గా.. అక్కడికి కాసేపటికే ఇద్దరూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తూ పిక్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత రోజు.. సామ్ తన అత్తవారింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన చిత్రాలను రాజ్ నిడిమోరు సోదరి శీతల్.. నెట్టింట్ ఎమోషనల్ నోట్ తో షేర్ చేశారు.

ఇప్పుడు సామ్, రాజ్ గోవా వెళ్లినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హనీమూన్ కోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో రాజ్, సామ్ కనిపించిన విజువల్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. గోవా నుంచి తిరిగి వచ్చాక.. ఇద్దరూ ఎవరి ప్రాజెక్టుల్లో బిజీ కానున్నారని సమాచారం.

అదే సమయంలో సమంత కోసం గోవాలో స్పెషల్ సర్ప్రైజ్ సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ రిసార్ట్ లో సన్ రైజ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నేచర్ అంటే ఎంతో ఇష్టపడే తన భార్యకు తెలియకుండానే సన్ రైజ్ కోసం పెళ్లి కు ముందే రాజ్ నిడిమోరు ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. రాజ్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ పిక్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే సామ్, రాజ్ పెళ్లి పిక్స్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివాహానికి వచ్చిన వారంతా ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు.

కాగా.. ఇప్పటికే మ్యారేజ్ గిఫ్ట్ గా సమంతకు రాజ్ బ్యూటిఫుల్ హౌస్ ను రాజ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి విదితమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఓ ఇంటిని రాజ్.. సామ్ తో పెళ్లికి ముందే కొనుగోలు చేశారట. కానీ ఆ విషయాన్ని పెళ్లిలో సమంతకు చెప్పిన తాళాలను గిఫ్ట్ గా ఇచ్చినట్లు వినికిడి. ఇకపై ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అక్కడే ఉంటారేమో మరి. ఏదేమైనా సామ్ కు రాజ్ వరుసగా సర్ప్రైజ్ లు ఇస్తున్నట్లు ఉన్నారు.

Tags:    

Similar News